గోవాలో కూడా అదే పని.. శ్రీముఖిపై విష్ణుప్రియ కామెంట్స్

Vishnu Priya about Sri mukhi In Goa

శ్రీముఖి, విష్ణుప్రియ, అరియానా గత వారంలో ఎంతగా సందడి చేశారో అందరికీ తెలిసిందే. గోవా ట్రిప్‌లో భాగంగా వీరు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. శ్రీముఖి తమ్ముడు శుశ్రుత్, ఆర్జే చైతూ, అవినాష్ ఇలా అందరూ కలిసి గోవాలో రచ్చ రచ్చచేశారు. అయితే శ్రీముఖికి గోవాలో ఓ చేదు సంఘటన జరిగిందట. అందరూ నీళ్లలో ఆడుకుంటూ ఉంటే.. శ్రీముఖి ఫోన్‌ను చైతూ నీళ్లలో పడేశాడంట. దీంతో ఆమెకు ఫోన్ లేకుండా పోయిందట.

Vishnu Priya about Sri mukhi In Goa
Vishnu Priya about Sri mukhi In Goa

అయితే వెంటనే అందరి ఫోన్‌లను తీసుకుని తన సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేసిందట. కానీ విష్ణుప్రియ మాత్రం తన ఫోన్ ఇచ్చేందుకు నిరాకరించిందట. ఇదే విషయాన్ని తాజాగా లైవ్‌లోకి వచ్చిన శ్రీముఖి చెప్పింది. ఇప్పటికీ తన ఫోన్ రికవరీ కాలేదని, అందులోకి నీళ్లు పోయాయని త్వరలోనే వస్తుందని చెప్పుకొచ్చింది. అయితే ఇదే విషయాన్ని చెబుతూ.. తన ఫోన్ పోవడంతో విష్ణుప్రియ సంబరపడిపోయిందట.

ఫోన్ పోయినా కూడా సైలెంట్‌గా లేదని అందరి ఫోన్లను తీసుకుని వాడటం మొదలుపెట్టిందంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. అలా ట్రిప్‌కు వచ్చి ఎంజాయ్ చేయడం మానేసి ఎప్పుడూ పని చేసుకుంటూనే ఉందని ఫిర్యాదు చేసింది. పొద్దంతా పని చేసుకుంటూ ఉండేది.. సాయంత్రం ఎంజాయ్ చేసేవాళ్లమని విష్ణుప్రియ తెలిపింది. మొత్తానికి ఈ గ్యాంగ్ మాత్రం గోవాలో దుమ్ములేపింది.