బాక్సాఫీస్ : “విరూపాక్ష” 2 డేస్ తెలుగు రాష్ట్రాల వసూళ్లు ఎంతంటే.!

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచిన లేటెస్ట్ చిత్రాల్లో మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా స్టార్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన క్రేజీ హారర్ థ్రిల్లర్ చిత్రం “విరూపాక్ష”.

భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యిన ఈ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందుకొని సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మరో బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి మొదటి షో నుంచే సాలిడ్ టాక్ సంతరించుకోగా రెండో రోజు నుంచి వసూళ్లు మరింత ఎక్కువ ఉంటాయని టాక్ వచ్చింది.

ఇక్కడ దీనితోనే రెండో రోజు సూపర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో నమోదు చేసింది. కాగా రెండో రోజు ఏపీ తెలంగాణాలో ఈ చిత్రం 5.8 కోట్ల షేర్ ని రాబట్టింది. దీనితో మొదటి రోజుతో పోలిస్తే 1 కోటి షేర్ ఎక్కువగా వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ రెండు రోజుల్లో నైజాం లో 4.53 కోట్ల షేర్ ని రాబట్టగా 6 కోట్ల షేర్ ని మొత్తం ఏపీ నుంచి రాబట్టింది.

దీనితో రెండు రోజుల్లో ఈ చిత్రం సుమారు 10.6 కోట్ల షేర్ ని రాబట్టేసింది. దీనితో రెండు రోజుల్లోనే ఈ సినిమా సగం టార్గెట్ ని రీచ్ అయ్యిపోయింది అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో రాజీవ్ కనకాల, సునీల్ తదితరులు నటించగా కాంతారా సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు.