వైరల్ : వై ఎస్ జగన్ కి పవన్ మనస్పూర్తి “స్పెషల్” శుభాకాంక్షలు.!

టాలీవుడ్ ప్రముఖ హీరో అలాగే పొలిటికల్ నాయకుడు పవన్ కళ్యాణ్ కోసం అందరికీ తెలిసిందే. మరి పవన్ ఇప్పుడు హీరోగా హరిహర వీరమల్లు అనే భారీ సినిమా సహా తన పాలిటిక్స్ లో కూడా చాలా బిజీగా ఉండగా తనని ఫాలో అయ్యే వారికి మాత్రం పవన్ ఇపుడు ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పై ఎలా నిప్పులు చెరుగుతాడో తెలిసిందే.

మరి ఇదిలా ఉండగా పవన్ అయితే ఎప్పుడు వ్యక్తిగతంగా మాత్రం జగన్ పై ఎలాంటి ద్వేషం లేదని చెప్పుకుంటూ వస్తాడు. ఇక ఈరోజు వై ఎస్ జగన్ పుట్టినరోజు కావడంతో అనేక మంది సినీ ప్రముఖులు సహా పలువురు నాయకులు కూడా జగన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండగా పవన్ కూడా వారితో పాటుగా “స్పెషల్” విషెష్ తెలియజేయడం వైరల్ గా మారింది.

తన జనసేన పార్టీ సోషల్ మీడియా నుంచి పవన్ ప్రెస్ నోట్ గా ఈ వెరీ “స్పెషల్” ప్రెస్ నోట్ ఇది అని చెప్పొచ్చు. ఇక్కడ స్పెషల్ అని ఎందుకు చెప్తున్నామంటే ఇది వరకు పవన్ జగన్ ని జగన్మోహన్ రెడ్డి అని కాకుండా జగన్ రెడ్డి అంటూ చెప్పేవారు. 

కానీ ఈ ప్రెస్ నోట్ లో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేయడం విశేషం. దీనితో ఈ ప్రెస్ నోట్ ఇప్పుడు ఇరు వర్గాల్లో వైరల్ గా మారింది.