టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విజయ్ ఆ సినిమా హిట్ అవ్వటంతో హీరోగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత విజయ్ నటించిన అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాలు వరుసగా హిట్ అవటంతో విజయ్ పాపులారిటీ మరింత పెరిగిపోయింది. ఇక అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ తన నటనతో రౌడీ హీరోగా మారిపోయాడు. అయితే ఆ తర్వాత విజయ నటించిన టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్స్ వంటి సినిమాలు వరుసగా ఫ్లాఫ్ అయ్యాయి. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా కూడా అందరి అంచనాలను తారుమారు చేస్తూ డిజాస్టర్ గా నిలిచింది.
పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన లైగర్ సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా సినిమా విడుదలకు ముందు విజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేశాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలకు సినిమాలోని కథకు ఎటువంటి సంబంధం లేకపోవడంతో ప్రేక్షకులు చాలా నిరాశ చెందారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని వారాంతరానికి నష్టాలతో ముగిసింది. అయితే ఈ సినిమా ప్లాఫ్ అవడంతో విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోతున్న జనగణమన సినిమాకి కూడా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనగణమన సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న మై హోమ్స్ సంస్థ ఆ సినిమా నిర్మాణ పనుల నుండి తప్పుకుంది. దీంతో నిర్మాతలు లేక సినిమా ఆగిపోయింది.
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా మీద విజయ్ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గతంలో విజయ నటించిన పెళ్లిచూపులు, గీతగోవిందం వంటి సినిమాలు లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండటంతో మంచి హిట్స్ అందుకున్నాయి. అందువల్ల ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న ఖుషి సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని విజయ్ ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాని డిసెంబర్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. కానీ వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లైగర్ సినిమా ప్లాప్ అవటంతో నిర్మాతలు విజయ్ తో సినిమా తీయటానికి ఆలోచిస్తున్నారు. మొత్తానికి లైగర్ సినిమా విజయ్ కెరీర్ మీద మరచిపోలేని దెబ్బ కొట్టింది.