మాస్టర్.. మనోళ్ల పొట్టకొట్టేలా ఉన్నాడు

vijay

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు దాదాపు అందరూ కూడా వీలైనంత త్వరగా ఒక సినిమా విడుదల చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద పోటీ ఎక్కువైనా నష్టమేనని కొందరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇతర సినిమాలతో పోటీపడితే ఇప్పుడున్న 50% ఆక్యుపెన్సీతో కలెక్షన్స్ ను రాబట్టడం అంటే రిస్క్ తో కూడుకున్న పనే అని చెప్పాలి.

ఈ సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. విజయ్ మాస్టర్ సినిమా తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అవుతున్నప్పటికి బజ్ అయితే గట్టిగానే ఉంది. మాస్ మహారాజా రవితేజ క్రాక్ తో కిక్కిస్తాడేమో అనుకుంటే రిలీజ్ రోజే తడబడ్డాడు. ఎంతవరకు పికప్ అవుతుందో తెలియదు. ఇక రామ్ రెడ్ సినిమా జనవరి 14న రానుండగా ఆ సినిమా రిలీజ్ అయ్యేవరకు నమ్మకం లేదు.

ఇక అల్లుడు అదుర్స్ అంటున్న బెల్లంకొండ కూడా ఇంకా కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. అయితే విజయ్ మాత్రం తమిళ్ లోనే కాకుండా ఈ సారి తెలుగులో కూడా మంచి హైప్ అయితే క్రియేట్ చేశాడని తెలుస్తోంది. సినిమా కోసం ఇక్కడి యూత్ కూడా గట్టిగానే ఎదురుచూస్తోంది. జనవరి 13న సినిమా రాబోతోంది. చూస్తుంటే ఈ సారి విజయ్ తెలుగులో మంచి ఓపెనింగ్స్ ను అందుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది. అదే జరిగితే తెలుగు సినిమా కెలెక్షన్స్ కు గండి పడినట్లే.. మరి మన సినిమాలు ఎంతవరకు పోటీని ఇస్తాయో చూడాలి.