Trisha: త్రిష ఇంట్లో విజయ్.. ఫోటోస్ వైరల్.. ఈ వార్తలు నిజం చేస్తున్నారా!

Trisha: తమిళ హీరో దళపతి విజయ్, త్రిష రిలేషన్ లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారు అంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా త్వరలోనే ఒక్కడి కాబోతున్నారు అంటూ తమిళ మీడియాలో గట్టిగానే వార్తలు వినిపించాయి. త్రిష, విజయ్ ల ప్రవర్తన కూడా అందుకు తగ్గట్టుగానే ఉండడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది. ఆ తర్వాత మళ్లీ కొద్ది రోజులు అంతా సైలెంట్ అయిపోయింది. అయితే ఇది ఇవ్వాళ మళ్లీ ఆ వార్తలు మొదలయ్యాయి. కొత్తగా మరొకసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అయితే అందుకు గల కారణం త్రిష తాజాగా షేర్ చేసిన ఫోటో. దళపతి విజయ్.. ఆదివారం పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్బంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు విష్ కూడా తెలిపారు. కీర్తి సురేశ్ కూడా విజయ్‌ కి బర్త్ డే విషెస్ చెబుతూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. అయితే త్రిష మాత్రంహ్యాపీ బర్త్ డే టూ బెస్టెస్ట్ అని క్యాప్షన్ పెట్టి, విజయ్ తన పెట్ డాగ్‌ తో ఆడుతుండగా, తాను పక్కనే కూర్చుని ఉన్న ఫోటోని త్రిష షేర్ చేసింది. దీంతో అభిమానులకు మరోసారి సందేహాలు మొదలయ్యాయి.

ఫోటో నీ బాగా గమనిస్తే అది త్రిష ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే అది ఇప్పుడు ఫోటోనా లేదంటే పాత ఫోటోనా అన్నది మాత్రం తెలియదు. ఈ ఫోటోతో మరొకసారి వీరి డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఈ ఫోటో నేను చూస్తుంటే గతంలో వచ్చిన డేటింగ్ వార్తలు వీరు నిజం చేస్తారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ కామెంట్స్ పై త్రిష విజయ్ లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి..