Vijay Thalapathy: వామ్మో.. విజయ్ ఆఖరి సినిమాకు ఏకంగా అన్ని వందల కోట్ల పారితోషకం అందుకుంటున్నారా?

Vijay Thalapathy: తమిళ హీరో విజయ్ దళపతికి తెలుగుతోపాటు తమిళంలో ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడిపిన విజయ్ ఇటీవల పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒకవైపు పాలిటిక్స్ యాక్టివ్ గా పాల్గొంటూనే మరొకవైపు తాను చివరిగా నటిస్తున్న జననాయకన్ సినిమా పనుల్లో కూడా బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

దానికి తోడు విజయ్ నటిస్తున్న ఆఖరి సినిమా కావడంతో ఈ సినిమాను ప్రేక్షకులు గట్టిగానే ఆదరించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అలాగే ఇది ఆఖరి సినిమా కావడంతో సినిమాను కూడా చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో ఇది ఆయన లాస్ట్ సినిమా అని ఎప్పటినుంచో ప్రచారం ఉండటంతో ఫ్యాన్స్ అంచనాలు పెరిగిపోయాయి. జననాయకన్‌ మూవీ ఫస్ట్ రోర్ ఫుల్ వైరల్‌ అవుతోంది. అయితే ఈ సినిమాకు విజయ్‌ దళపతి భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సౌత్‌ లో ఇప్పటివరకు ఏ హీరో తీసుకోనంత పారితోషకం విజయ్ తీసుకున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు ఏకంగా విజయ్ దళపతి రూ. 275 కోట్ల పారితోషికం తీసుకున్నారనే వార్త సినీ ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. KVN ప్రొడక్షన్స్ ఎలాంటి లాభాల భాగస్వామ్యం లేదా కోత లేకుండా పూర్తిగా ఈ భారీ మొత్తాన్ని విజయ్‌ కు చెల్లించినట్లు టాక్. ఇంత పెద్ద మొత్తంలో ఒక సినిమాకు ఒక హీరోకు రెమ్యూనరేషన్ చెల్లించడం సౌత్ ఇండియా ఫిల్మ్ హిస్టరీలోనే ఒక కొత్త రికార్డు అని చెప్పాలి. ఈ విషయం తెలిసి అభిమానులు నెటిజన్స్ షాక్ అవుతున్నారు. వామ్మో ఒక్క సినిమాకు ఏకంగా అన్ని వందల కోట్లా అని నోరెళ్ళ బెడుతున్నారు.