విజయ్‌ని వెంటాడుతున్న డిజాస్టర్ భయం.. అందుకే ఆ సినిమా డిలే?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లిచూపులు సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో వరస విజయాలు అందుకున్నాడు. ఈ సినిమాల వల్ల ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ పెరిగింది. ఇలా వరుస విజయాలతో ఫామ్ లో ఉన్న సమయంలో విజయ్ నటించిన డియర్ కామ్రేడ్, నోటా, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయిన కూడా ప్రేక్షకులలో విజయ్ కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.

ఇక ప్రస్తుతం ఈ రౌడీ బాయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. ఎప్పుడో రిలీజ్ కావలసిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని విడుదలకి సిద్దమవుతోంది. అయితే విజయ్ కి ఇప్పుడు డిజాస్టర్ సినిమాల భయం వెంటాడుతోంది. సాధారణంగా పూరీజగన్నాథ్ చేసే ఏ సినిమా అయిన ,ఎంత పెద్ద హీరో అయిన 5 నెలల్లో సినిమా రిలీజ్ అవుతుంది. కానీ మొదటిసారిగా లైగర్ సినిమా ఇంత సమయం తీసుకుంది. పూరి జగన్నాథ్ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మరో ప్రాజెక్ట్ కూడా పట్టలెక్కింది

పూరీజగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమా కోసం వీరిద్దరూ పని చేస్తున్నారు. అయితే ఈ రెండూ సినిమాలని ఒకేసారి రిలీజ్ చేయటానికి మొదట ప్లాన్ చేశారు. కానీ ఒకవేళ వీటిలో ఒకటి ప్లాప్ అయిన కూడా దాని ప్రభావం మరోక సినిమా మీద ఉంటుంది. అందువల్ల మొదట లైగర్ సినిమా విడుదల చేసి తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత జనగణమన విడుదలకి పూరి మార్క్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యలో విజయ్ దేవరకొండ, సమంత కలసి నటిస్తున్న ఖుషి సినిమా విడుదల చేయటానికి ప్లాన్ చేసారు. ఇలా డిజాస్టర్ సినిమాల భయంతో విజయ్ లైగర్ సినిమాకి చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.