Venu Swamy: వేణుస్వామి పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన తరచూ సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన చేసే వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవ్వటమే కాకుండా వేణు స్వామి పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చేవి.
ఇలా ఇప్పటివరకు సినిమా రాజకీయాలకు సంబంధించిన వారి గురించి జ్యోతిష్యం చెప్పిన ఈయన ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో చేశారు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు కొద్ది రోజుల క్రితం ఈయన పెద్ద యుద్ధం జరగబోతుంది అంటూ ఒక వీడియోని చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
భారత్ – పాక్ యుద్ధం జరుగుతుందని తానకు ముందే తెలుసన్నాడు వేణు స్వామి. అందుకు సాక్ష్యంగా ఓ వీడియోను విడుదల చేయడమే కాకుండా యుద్ధం తర్వాత జరగబోయే పర్యవసానాలు గురించి కూడా తెలిపారు.ఇండియా పాకిస్తాన్ యుద్దం జరుగుతందని నేను ముందు చెప్పాను. ఉగాదికి 10 రోజులు ముందు ఈ వీడియోను చేశానని ఆయన అన్నారు. మహాభారత యుద్దం 5 గ్రామాల కోసం జరిగింది. ఇప్పుడు భారత్ పాక్ యుద్దం కూడా భూమి కోసమే జరిగిందని తెలిపారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కోసమే ఈ యుద్ధం జరిగిందని ఇది చిన్న గొడవలా మొదలై తుపానుగా మారుతుంది. ఈ యుద్దంతో పాకిస్తాను దాదాపు మొత్తం నాశనం అవుతుందని ఆయన అన్నారు. దాదాపు 80 శాతం పాకిస్తాన్ పాడైపోయిందని వేణు స్వామి తెలిపారు.షష్ఠ గ్రహ కూటమి వల్ల ఈ యుద్దం ప్రపంచాన్ని ఇబ్బందుల్లో నెడుతుందనీ తెలిపారు. మీన రాశిలో శని, శుక్రుల కలయిక అనేది చాలా డేంజర్. ఈ విపత్తు వల్ల పెద్ద పెద్ద నాయకులు, ప్రముఖులు మరణిస్తారు. ఆర్ధిక మాంద్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందనీ వేణు స్వామి ఈ సందర్భంగా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సంచలనగా మారింది. అయితే ఈ వీడియో పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ వీడియోలకు వేణు స్వామి కామెంట్ సెషన్ కూడా ఆఫ్ చేయటం గమనార్హం.