తన సినిమా కోసం ఫ్యామిలీతో కలిసి రావాలని ట్వీట్ చేసిన వెంకీ.. స్పందించిన పవన్ ఫ్యాన్స్?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్ 3. ఈ సినిమా మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి చిత్రబృందం ఇంటర్వ్యూలలో పాల్గొనడమే కాకుండా మీడియా సమావేశాల్లో కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించి ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఇక ఈ సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో వెంకటేష్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా వెంకటేష్ స్పందిస్తూ… అందరూ కలిసి రావాలమ్మ అంటూ ఎఫ్ 3 సినిమాకి సంబంధించిన పోస్టర్ తో ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ ట్వీట్ పై స్పందించిన వెంకీ అభిమానులు ఇక్కడ వెంకీ మామ ఫ్యాన్స్.. వెంకీ మామ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం తప్పకుండా ఫ్యామిలీతో ఈ సినిమాకి వస్తామంటూ రీ ట్వీట్ చేస్తున్నారు. అలాగే మరి కొందరు మీ ఆహ్వానానికి థాంక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా వెంకటేష్ చేసిన ఈ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందించారు. ఈ సందర్భంగా పవన్ అభిమాని ఈ ట్వీట్ పై స్పందిస్తూ.. నేను పవన్ కళ్యాణ్ అభిమాని అయినప్పటికీ వెంకీ అంటే అందరికీ ఎంతో ఇష్టమైన హీరో. నేను కూడా నా ఫ్యామిలీతో పాటు ఈ సినిమా చూడటానికి వస్తాను అంటూ కామెంట్ చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ అభిమానులు వెంకటేష్ సినిమా పై స్పందిస్తూ పాజిటివ్ కామెంట్ చేయడంతో వెంకటేష్ అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.