బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా, జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న సినిమా బేబీ జాన్. ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కాబోతుంది.ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రముఖ యూట్యూబ్ రణవీర్ అల్లాభాడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ ఎమోషనల్ అయ్యాడు. 26 సంవత్సరాలుగా తనతో కలిసి ఉన్న డ్రైవర్ మనోజ్ ఆకస్మిక మరణం గురించి చెప్తూ కన్నీరు పెట్టుకున్నాడు. డ్రైవర్ మరణంతో తన ఆలోచన ధరణి పూర్తిగా మారిపోయిందని చెప్పాడు.మనోజ్ మరణానికి ముందు వరుణ్ వేరు ఇప్పటి వరుణ్ వేరు.
అంతకుముందు నేను లైఫ్ ని చాలా ఈజీగా గడిపేసాను కానీ మనోజ్ మరణం తర్వాతే నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది. మనోజ్ నాకు చాలా క్లోజ్ మేము పనిచేస్తున్నప్పుడు సడన్గా చనిపోయాడు, నేను అతనికి సిపిఆర్ చేశాను కరెక్ట్ టైం లోనే హాస్పిటల్ కి కూడా తీసుకువెళ్ళాం, అతడి ప్రాణాన్ని కాపాడినట్లే అనుకున్నాం కానీ హాస్పిటల్ కి తీసుకెళ్లేసరికి అతను చనిపోయాడు అని చెప్పారు. అతను నా చేతిలోనే చనిపోయాడు. అతను చనిపోవడం నాకు చాలా కష్టంగా అనిపించింది.
ఆన్ స్క్రీన్ హీరోగా చేస్తాను కదా అందుకే నన్ను నేను ఒక ఆదర్శవంతమైన హీరోగా చూడాలని అనుకున్నాను కానీ ఆరోజు హీరోగా నేను ఫెయిల్ అయిపోయాను. అతని మరణం తనని వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎంతో ప్రభావితం చేసిందని చెప్పాడు. అతని మరణం తర్వాత నా సినిమాలు కూడా తగ్గిపోయాయి రెండేళ్ల తర్వాత ఇప్పుడు నా సినిమా వస్తుంది మనోజ్ మరణ బాధని తగ్గించుకోవడానికి రామాయణం, భగవద్గీత వంటి ధార్మిక గ్రంథాల వైపు మొగ్గు చూపినట్లు వరుణ్ ధావన్ వెల్లడించారు.
జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి కానీ మనిషిగా మనం ముందుకు సాగాలని నేను గ్రహించాను. నా దగ్గర ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి వాటికి సమాధానం కోసమే రామాయణం మహాభారతాలని చదువుతున్నారని చెప్పాడు వరుణ్. వరుణ్ డ్రైవర్ మనోజ్ కి కోవిడ్ సోకింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారం రోజులకే అతను గుండెపోటుతో మరణించినప్పుడు కూడా వరుణ్ ఇలాగే ఎమోషనల్ అయిపోయాడు. అప్పట్లో ఈ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.