ఊర్వశి.. ఈ బిల్డప్ అవసరమా?

బాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకొచ్చిన అందాల తార ఊర్వశీ రౌతేలా. అందాల పోటీలలో పాల్గొని మిస్ యూనివర్స్ కిరీటం సొంతం చేసుకుంది. అక్కడి నుంచి మోడలింగ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు 2013లో హీరోయిన్ గా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె మొదటి సినిమా సింగ్ సాబ్ ఈజ్ గ్రేట్. ఈ మూవీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా వరుస అవకాశాలు అందుకుంది.

ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు ఐటెం సాంగ్స్ కి కేరాఫ్ గా ఊర్వశీ రౌతేలా మారిపోయింది. ఈ ఏడాది వాల్తేర్ వీరయ్య టైటిల్ సాంగ్ లో ఈ అమ్మడు మెగాస్టార్ తో ఆదిపాడింది. ఈ సాంగ్ ప్రేక్షకులకి భాగా రీచ్ అయ్యింది. అలాగే రామ్ పోతినేని, బోయపాటి మూవీలో కూడా ఊర్వశీ రౌతేలా ఐటెం సాంగ్ చేస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే బాలీవుడ్ లో మోస్ట్ ఫ్యాషన్ ఐకాన్స్ లో ఊర్వశీ రౌతేలా కూడా ఒకరు. ఈమె డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది. ఫ్యాషన్ గర్ల్ అనే ఇమేజ్ ఊర్వశీకి ఉంది. ఇక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ అమ్మడు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో పార్టిసిపేట్ చేసింది. అదే సమయంలో ఆమె మొసలి షేప్స్ తో ఉన్న ఆభరణాలు ధరించింది.

ఈ ఆభరణాలు ఊర్వశీ రౌతేలా ధరించి షోకేస్ చేసిన తర్వాత వాటి ధర అమాంతం పెరిగిపోయిందంట. ఈ విషయాన్ని ఊర్వశీ రౌతేలా పీఆర్ టీమ్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసింది. మొసలి షేప్స్ లో ఉన్న ఈ ఆభరణాలు 200 కోట్లు ఉంటే ఊర్వశీ ధరించిన తర్వాత వాటి విలువ 287 కోట్లకి పెరిగిందని రాసుకొచ్చారు. ఈ ఆభరణాలతో ఊర్వశీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని ప్రమోట్ చేశారు.

అయితే ఊర్వశీ ధరించిన ఈ ఆభరణాలు ఉద్దేశించి ప్రమోట్ చేసుకోవడంపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇతరులు ధరించిన కాపీ ఆభరణాలు ఊర్వశీ ధరించింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇప్పటికే వీటిని హాలీవుడ్ నటి మోనికా బెలూచి ధరించారని, వాటిని ఏదో ప్రత్యేకంగా మరల ఊర్వశీ మాత్రమే ధరించినట్లు కొత్తగా చెబుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీటితో పాటు ఆ ఆభరణాల డిజైన్ మీద కూడా నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేయడం విశేషం.