మహేష్ ఫ్యాన్స్ కి దెబ్బేస్తున్న త్రివిక్రమ్?

179-1793662_mahesh-babu-images-beard-mahesh-babu-new-look

టాలీవుడ్ లో భారీ స్టార్డం ఉన్న హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే మహేష్ బాబు ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి కాంబినేషన్ లో మూడో సినిమా ఇది కావడంతో అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ అయితే సినిమా విషయంలో ఇప్పుడు తెలుస్తున్నాయి.

నిజానికి ఈ సినిమా భారీ ఏక్షన్ డ్రామా అయినప్పటికీ ఈ సినిమా విషయంలో ఇప్పుడు త్రివిక్రమ్ షాకింగ్ మార్పులు చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈసారి కథ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంటుందట. దీనికి ఆధారంగా అయితే సినిమాపై వినిపిస్తున్న టైటిల్స్ అని చెప్పాలి.

లేటెస్ట్ గా ఓ టైటిల్ పేరు బాగా వైరల్ గా మారింది. “అమరావతికి అటు ఇటు” అని ఈ టైటిల్ పేరట. ఇది వినడానికే వింతగా ఉంది కానీ నిజంగా ఈ టైటిల్ మేకర్స్ పరిశీలనలో ఉందట. కానీ మళ్ళీ టైటిల్ విషయంలో వెనక్కి వెళ్లారట.

ఇక ఈ టైటిల్ తోనే సినిమా నేపథ్యం ఓ ఫామిలీ డ్రామా అన్నట్టుగా అర్ధం అవుతుంది. దీనితో మొదట్లో ఏం ఆశించారో అభిమానులకి మళ్ళీ త్రివిక్రమ్ దెబ్బ కొట్టేలానే ఉన్నాడని చెప్పక తప్పదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే మరియు శ్రీ లీల లు నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.