లేటెస్ట్ : “ఉస్తాద్ భగత్ సింగ్” గ్లింప్స్ బ్లాస్ట్ కి టైం వచ్చేసింది.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న మరో మాస్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మరి వీరి నుంచి ఇది వరకే వచ్చిన భారీ హిట్ సినిమా “గబ్బర్ సింగ్” మేనియా ఈ సినిమాపై కూడా కనిపిస్తుంది.

దీనితో ఇదే క్రేజ్ ని మేకర్స్ కూడా గట్టిగా పట్టుకున్నారు. ఇక గబ్బర్ సింగ్ అయితే రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు కావస్తుండడంతో ఇదే మే 11 న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బ్లాస్టింగ్ ట్రీట్ ఫస్ట్ గ్లింప్స్ ని అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అయితే నిన్న ఈ వీడియోని ఏకంగా థియేటర్ లో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ఫ్యాన్స్ కి కావాల్సినంత హైప్ ని అందిస్తూ వస్తున్నారు. కాగా ఇపుడు అయితే మరో సాలిడ్ అప్డేట్ ని అందించారు. ఈ సినిమా గ్లింప్స్ అయితే యూట్యూబ్ లో రేపు మే 11న సాయంత్రం 4 గంటల 59 నిమిషాలకి ఈ వీడియో లాంచ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు.

దీనితో ఉస్తాద్ భగత్ సింగ్ భారీ బ్లాస్ట్ కి టైం ఫిక్స్ అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తుండగా ఈ చిత్రం తేరి కి రీమేక్ గా తెరకెక్కుతుంది. అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేసి మేకర్స్ వచ్చే ఏడాది రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని భోగట్టా.