ఆ దర్శకుడితో అలాగే వుంటుంది మరి.!

అందరు దర్శకులతో వ్యవహరించినట్లుండదు ఆయనతో.! ఫిలిం మేకింగ్‌లో ఆయన మాస్టర్. ఓ పెద్ద సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో తెలియదు. ఈలోగా నిర్మాతకి సహజంగానే ఆందోళన పెరుగుతుంటుంది.

స్టార్ హీరో.. పెద్ద దర్శకుడు.. సినిమా మాత్రం ముందుకు కదలడంలేదు. ఖర్చయితే తడిసి మోపెడైపోతోంది. ఎప్పటికి పూర్తవుతుందో చెబితే, పబ్లిసిటీ వ్యవహారాలు మొదలు పెట్టుకోవచ్చంటూ దర్శకుడ్ని సినిమా గురించి అడిగే ప్రయత్నం చేశాడట ఆ నిర్మాత. అడగడం కాదు, నిజానికి అది నిలదీయడం.

కానీ, సదరు దర్శకుడు ఆ నిర్మాతని అస్సలు పట్టించుకోలేదట.! దాంతో, నిర్మాతకు ఒళ్ళు మండిపోయింది. కానీ, ఏం చేయలేని పరిస్థితి. హీరోని అడిగి, దర్శకుడి నుంచి సమాచారం రాబట్టాలని కోరాడట.

‘సినిమా బాగా వస్తోంది. కంగారు పడకండి..’ అంటూ సదరు హీరో, ఆ నిర్మాతని శాంతపరిచేందుకు ప్రయత్నించాడట. సదరు హీరో కూడా, సినిమా ఆలస్యంపై ఒకింత అసహనంతోనే వున్నా, దాన్ని బయటపెట్టడంలేదు.

మొత్తంగా చూస్తే, ఇటు హీరో అటు నిర్మాత.. ఇద్దరూ ఎరక్కపోయి ఇరుక్కుపోయారు ఆ దర్శకుడి దగ్గర. ఎన్నాళ్ళు.? ఎన్నేళ్ళు.? అంటూ బిత్తర చూపులు చూడటం తప్ప, ఏం చేయగలరు.? నిజంగానే, ఎరక్కపోయి ఇరుక్కుపోయారు మరి.!