ఈ ఏడాది పాన్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ భారీ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది “ఆదిపురుష్” అని చెప్పాలి. దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంతోనే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ రామాయణం ఆధారంగా తెరకెక్కగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే గతంలో ఈ సినిమా టీజర్ రాకముందు వరకు ఎలాంటి పాజిటివ్ హైప్ ఉందో టీజర్ తర్వాత అంతకు పాతాళంలోకి సినిమా పడిపోయింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ రాబోతుండగా ఇపుడు కూడా డే వాతావరణం నెలకొంది. అయితే ఈసారి అవుట్ పుట్ పై అంతా నమ్మకంగానే ఉన్నారు.
కానీ ట్రైలర్ తోనే సినిమా చూడాలా లేదా అని చాలా మంది డిసైడ్ కానున్నారు. సినిమా ఎలానో రామాయణం కంటెంట్ లో తేడా ఉండదు కానీ సినిమా విజువల్స్ లో ఏమన్నా తేడా ఉంటే మాత్రం ఇది చాల పెద్ద దెబ్బె సినిమాకి కొడుతోంది అని చెప్పక తప్పదు. రేపు వచ్చే ట్రైలర్ లో గాని మళ్ళీ విజువల్స్ మాత్రం ఏమాత్రం తేడా కొట్టినా ఇక అంతే సంగతి అని చెప్పక తప్పదు.
ఒకవేళ యావరేజ్ గా ఉన్నా కొంతమంది అయినా చూడొచ్చు కానీ మళ్ళీ టీజర్ లా గాని ఉందంటే ఇక ఈ సినిమాని కాపాడడం ఎవరి వల్ల కాదని చెప్పక తప్పదు. ఇక ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ మరియు సోనాల్ చౌహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
