క్లారిటీ : “ఆదిపురుష్” వరల్డ్ ఫస్ట్ షో ఇందుకే ఆపేశారట.!

ఇప్పుడు వరల్డ్ సినిమా దగ్గర మంచి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధం అవుతున్న లేటెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మాసివ్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. కాగా పలు హాలీవుడ్ భారీ సినిమాలు కూడా పోటీ ఉన్న ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ గ్రాండ్ గా జూన్ 16న రిలీజ్ కి ప్లాన్ చేశారు.

కాగా ఈ డేట్ కన్నా ముందే యూఎస్ లో జరిగే ఓ ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్ లో అయితే ఈ చిత్రం అన్ని దేశాల కంటే ముందే జూన్ 13నే గ్రాండ్ అండ్ స్పెషల్ ప్రీమియర్ ని అయితే కన్ఫర్మ్ చేశారు. మరి ఇప్పుడు ఈ అవైటెడ్ షో అయితే రద్దు చేసినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి.

అయితే ఈ చిత్రం షో రద్దు అయ్యిందో ఇప్పుడు తెలుస్తుంది. కాగా ఈ షో విషయంలో మేకర్స్ నే వెనకడుగు వేసారట. మరీ అంత తొందరగా ప్రీమియర్ అక్కరలేదని అందుకే నార్మల్ యూఎస్ టైమింగ్స్ ప్రకారం జరిగే ప్రీమియర్ లోనే సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టుగా ఇప్పుడు సినీ వర్గాల్లో తెలుస్తుంది.

దీనితో ఈ రకంగా ఆదిపురుష్ వరల్డ్ ఫస్ట్ షో అయితే ఆగిపోయిందట. ఇక ఈ చిత్రంలో కృతి సనన్ జానకి దేవిగా నటించగా సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో సన్నీ సింగ్ లక్ష్మణుని పాత్రలో నటించారు. గ్రాండ్ గా ఈ సినిమా ఈ జూన్ 16న అయితే విడుదల కాబోతుంది. ఫ్యాన్స్ ఈ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.