గాసిప్స్ : విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం అప్పుడే??

ప్రస్తుతం తెలుగు సినిమా దగ్గర ఉన్న కొన్ని ఫేమస్ జంటల్లో సెన్సేషనల్ పెయిర్ విజయ్ దేవరకొండ అలాగే హీరోయిన్ రష్మిక మందన్న ల జంట కూడా ఒకటి. కాగా విజయ్ దేవరకొండ రష్మిక కలిసి రెండు సినిమాలు చేశారు. కానీ తర్వాత ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నట్టుగా టాక్ నడిచింది.

ఇక పక్కన పెడితే తర్వాత ఇద్దరు ఒకే ప్లేస్ లో ఉండి ఫోటోలు వేరు వేరు గా పెట్టడం వంటివి కూడా బాగా వైరల్ అయ్యాయి. దీనితో వారి ప్రేమాయణంపై నమ్మకం ఇంకాస్త పెరిగింది. కానీ తర్వాత నందమూరి బాలయ్య చేస్తున్న టాక్ షోలో ఆనిమల్ ప్రమోషన్స్ కి వచ్చినపుడు మాత్రం రష్మిక దొరికిపోయింది.

తన ఫోన్ లో విజయ్ కాంటాక్ట్ ఏమని సేవ్ చేసింది? అక్కడే ఆమె మాట్లాడిన విధానం చూసాక చాలా మందికి ఇక కన్ఫర్మ్ అయ్యిపోయింది ఇద్దరు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్తారు అని. కాగా ఇప్పుడు వీరిద్దరి నిశ్చితార్థం అంటూ కొన్ని గాసిప్స్ ఇపుడు బయటకి వచ్చాయి.

దీనితో ఈ ఇద్దరు వచ్చే నెల ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఈ ఇద్దరు ఇప్పుడు పలు భారీ చిత్రాలు వేరే వేరేగా చేస్తున్నారు. అలాగే వీరి కాంబినేషన్ లో మరో సినిమా కోసం అయితే ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.