ఇండస్ట్రీ బజ్ : “ఉస్తాద్ భగత్ సింగ్” బిజినెస్ అప్పుడు నుంచే స్టార్ట్?

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడ్ హరీష్ శంకర్ తో చేస్తున్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కోసం అందరికీ తెలిసిందే. మళ్ళీ గబ్బర్ సింగ్ త్రావత్ రిపీట్ అవుతున్న సినిమా ఇది కావడంతో దీనిపై కూడా గట్టి అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యిపోయింది. ఇక ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ ఈ మే 11న గబ్బర్ సింగ్ రిలీజ్ డే కావడంతో అదిరే గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి ఈ టీజర్ తర్వాత నుంచే మేకర్స్ ఈ సినిమా తాలూకా బిజినెస్ ని స్టార్ట్ చేయనున్నట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

టీజర్ చూసాక అందరికీ ఓ క్లారిటీ కూడా వస్తుంది. దీనితో దాని బట్టి అంచనాలు పెరిగి మంచి ఫిగర్స్ పలకొచ్చు అని మేకర్స్ ప్లాన్ కావచ్చు. మరి ఈ సినిమా బిజినెస్ ఎంత మేర జరుగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని అయితే ఆల్రెడీ తెలుగులో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యిన “పోలీసోడు” కి రీమేక్ చేస్తున్నారు.

మరి ఇది సక్సెస్ అవుతుందో లేదో కూడా చూడాలి. కాగా ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. వచ్చే ఏడాదిలో సినిమా రిలీజ్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.