సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. అయితే ఈ అభిమానాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి హీరోలు రాజకీయాలలోకి రావడం జరుగుతుంది. ఇలా ఎంతోమంది సినీ హీరోలు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అక్కినేని నాగార్జున సైతం వచ్చే ఎన్నికలలో విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ విధంగా ఈసారి మాత్రం నాగార్జున పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్ అంటూ వార్తలు రావడంతో ఇలా పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తలపై నాగార్జున స్పందించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ప్రతిసారి ఎన్నికలు వచ్చే సమయంలో తాను రాజకీయాలలోకి రాబోతున్నానంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు ఏమాత్రం చేయడం లేదని తాను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నానంటూ ఈ సందర్భంగా నాగార్జున పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు.
ఇకపోతే నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ది ఘోస్ట్ సినిమా ద్వారా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాను రాజకీయాల గురించి, పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు చాలా దూరంగా ఉన్న తనకి ఏదైనా పొలిటికల్ కథాంశంతో తెరకెక్కి సినిమా కనుక వస్తే తప్పకుండా నటిస్తానని ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు.