కష్టాల్లో పడిన పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన… సినిమా నుండి తప్పుకున్న ప్రొడ్యూసర్?

పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం లైగర్. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు పూరి జగన్నాథ్, ఛార్మి కూడా భారీగా నష్టపోయారు. పూరి జగన్నాథ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా రిజల్ట్స్ ఇలా తలకిందులు కావడంతో పూరి ప్రస్తుతం తన తదుపరి సినిమా జనగణమన సినిమా మీద తన ఆశలు పెట్టుకున్నాడు.

లైగర్ సినిమా విడుదల కాకముందే పూరీ జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాని విజయ్ దేవరకొండలో తీస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. చాలాకాలంగా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో ఈ సినిమాతీయాలని ఎదురుచూసిన పూరి జగన్నాథ్ కి వారి డేట్స్ దొరకపోవడంతో విజయ్ దేవరకొండతో ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే జనగణమన ప్రీ ప్రొడక్షన్, ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి అయినట్లు సమాచారం. అయితే తాజాగా లైగర్ సినిమా ఎఫెక్ట్ జనగణమన మీద పడినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మించిన లైగర్ సినిమా ప్లాప్ అవటంతో జనగణమన నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు సమాచారం.

జనగణమన సినిమాకి మై హోమ్ గ్రూప్ నిర్మాణ భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. జనగణమన ప్రీ ప్రొడక్షన్ కి, జరిగిన షూటింగ్ కి కలిపి ఈ సంస్థ రూ. 20 కోట్లు వరకూ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా జనగణమన సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన పూరి జగన్నాథ్ ప్లాన్ చేసాడు. అయితే లైగర్ సినిమా వసూళ్లు చూశాక జనగణమన సినిమా మీద అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం సరికాదని నిర్మాతల ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల మై హోమ్ గ్రూప్ సంస్థ జనగణమన ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు పూరి జగన్నాథ్ తో నేరుగా చెప్పేశారట. దీంతో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ పరిస్థితి అయోమయంలో పడింది. ఈ సినిమా పూర్తి కావాలంటే మరొక నిర్మాత దొరకాలి. లేదంటే ఈ సినిమా ఆగిపోతుంది. ఈ సినిమా ఆగిపోతే పూరి, ఛార్మీ కి మాత్రమే కాకుండా విజయ్ కి చాలా నష్టం జరుగుతుంది.