ఆ హీరో సినిమా కథ లీక్ చేసేశారట.! ఇది మరీ టూమచ్.!

ఓ హీరో హిట్టు కోసం చాలా కసిగా వున్నాడు. చావో రేవో.. అన్నట్టు, సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా చేశామంటూ చెప్పుకొచ్చాడు కూడా. దర్శకుడిదీ అదే పరిస్థితి.

హీరో మార్కెట్ కంటే కూడా ఎక్కువగానే బడ్జెట్ పెట్టేశారు. బజ్ మాత్రం ఒకింత డల్లుగా కనిపిస్తోంది. ఇంతలోనే, సినిమా కథ ఇదేనంటూ ఓ లీక్ బయటకు వచ్చింది.

ఆ ట్విస్టు, ఈ ట్విస్టు.. అంటూ, సినిమా గురించి హైప్ పెంచేందుకు ప్రయత్నిస్తోంది చిత్ర యూనిట్. ప్రమోషనల్ ఇంటర్వ్యూలు కూడా షురూ అయ్యాయి. ఇంతలోనే, సినిమాలో అసలు ట్విస్ట్ ఇదీ.. అంటూ కొన్ని లీకులు బయటకు వస్తున్నాయ్.

ఈ తరహా లీకుల దురద వున్న ఓ మీడియా ప్రతినిథి ఇదంతా చేస్తున్నాడన్నది చిత్ర నిర్మాణ సంస్థ ఆవేదనగా కనిపిస్తోంది. గట్టిగా ఏమీ అనలేని పరిస్థితి. చాలా సినిమాలకు ఈ తరహా లీకులిస్తున్నాడట సదరు మీడియా ప్రతినిథి.

సినీ మీడియాపై ఈ మధ్య సినీ ప్రముఖుల సెటైర్లు ఎక్కువయ్యాయ్. దాంతో, ఆయా సినిమాల్ని దెబ్బ కొట్టడానికి, కొందరు మీడియా ప్రతినిథులు ఈ ‘లీకుల’ బాటని ఎంచుకున్నారంటూ సదరు హీరో గుస్సా అవుతున్నాడట.

ఎవరికో పడాల్సిన దెబ్బ తనకు పడిందంటూ ఆయన వాపోతున్నట్లు తెలుస్తోంది. ఎవరా హీరో.? ఎవరా లీకు వీరుడు.? ఏమా సినిమా.? జస్ట్ సస్పెన్స్ అంతే.!