గాడ్ ఫాదర్ సినిమాని వెంటాడుతున్న సెంటిమెంట్.. రిపీట్ అయితే గాడ్ ఫాదర్ పరిస్థితి ఏంటి..?

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్నారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి అంచలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ స్థాయికి చేరుకున్నాడు. 100కు పైగా సినిమాలలో నటించిన చిరంజీవి ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ నేటితరం హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. తొందరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

అయితే ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. గాడ్ ఫాదర్ సినిమా ఇంగ్లీష్ టైటిల్ తో ఉండటంవల్ల ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఇంగ్లీష్ టైటిల్స్ తో ఉన్న సినిమాలలో చిరంజీవి నటించాడు. అయితే వాటిలో ఎక్కువ సినిమాలు ప్లాప్ అవ్వకపోయినా కూడా ఒక మోస్తారుగా ఆడాయి. దీంతో అప్పటినుండి చిరంజీవిని ఈ ఇంగ్లీష్ టైటిల్ సెంటిమెంట్ వెంటాడుతోంది.

ఇక ఇటీవల చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా కూడా ఇంగ్లీష్ టైటిల్ తో ఉంది. అందువల్ల ఈ సినిమా గురించి చిరంజీవిలో టెన్షన్ మొదలైనట్లు సమాచారం. ఈ ఇంగ్లీష్ టైటిల్ సెంటిమెంట్ రిపీట్ అయితే ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్ సినిమా కూడా చిరంజీవి కెరీర్ లో పెద్ద డిజాస్టర్ గా నిలుస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తూ.. చిరంజీవి నటించిన ఛాలెంజ్, గ్యాంగ్ లీడర్ స్టాలిన్ వంటి సినిమాలు మంచి హిట్ అయ్యాయని, ఇవన్నీ మూఢ నమ్మకాలని కొట్టిపారేస్తున్నారు. ఏది ఎమైనా గాడ్ ఫాదర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.