లైగర్ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న రౌడీ హీరో.. ఎన్ని కోట్లో తెలుసా?

రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండకు విపరీతమైన అభిమానులు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఆయన స్టైల్ ఆయన ఆటిట్యూడ్ కి విపరీతంగా ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఈ హీరోకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఏకంగా సెలబ్రిటీలకు కూడా ఈయన క్రష్ అయ్యారు. ఇలా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇకపోతే ఈ సినిమాని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో పాటు పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఈ సినిమా పూరి జగన్నాథ్ కెరీర్ లోను విజయ్ దేవరకొండ కెరియర్ లోను అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది.బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఇప్పటికే విజయ్ దేవరకొండ అనన్య పాండే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం గురించి హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఇప్పటివరకు తన కెరీర్లో తీసుకొని హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 35 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ బారీ స్థాయిలో తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నారు. ఏది ఏమైనా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా అవకాశాలు అందుకోవడం మామూలు విషయం కాదని చెప్పాలి.