సెన్సార్ పూర్తి చేసుకున్న గాడ్ ఫాదర్.. స్పందించిన డైరెక్టర్!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని డైరెక్టర్ మోహన్ రాజా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఈయన ట్వీట్ చేస్తూ..ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాపై ప్రశంసల కురిపించడమే కాకుండా యు /ఎ సర్టిఫికెట్ జారీ చేశారని వెల్లడించారు. సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రివ్యూ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

సెన్సార్ నుంచి పాజిటివ్ రివ్యూ వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులు ఎలాంటి విజయం అందిస్తారో వేచి చూడాలి అంటూ మోహన్ రాజా ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇకపోతే ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ అలాగే సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.