రీమేక్స్ విషయంలో మెగాస్టార్ కీలక నిర్ణయం..కానీ..

ఇపుడు టాలీవుడ్ లో ఉన్న ట్రెండ్ లో రీమేక్ చిత్రాలకి ఏమంత గొప్ప ఆదరణ దక్కడం లేదు. ఓ స్టార్ హీరో చేస్తే జస్ట్ మొదటి మూడు రోజులు వసూళ్లు వస్తున్నాయి తప్పితే నాలుగో రోజులోకి వస్తే భారీ డ్రాప్ తప్పడం లేదు. ఇక చిన్న హీరోస్ కానీ చిన్న నటీనటులు ఏమన్నా రీమేక్ లు చేస్తే అవి గట్టెక్కడం అటుంచితే అసలు అవి వచ్చాయి అని కూడా చాలా మందికి తెలియడం లేదు.

ఈ మధ్య కాలంలో వచ్చిన బుట్టబొమ్మ, గాడ్ ఫాదర్, బ్రో అలాగే ఓరి దేవుడా లాంటి చిత్రాలే వాటికి ఉదాహరణలు ఈ చిత్రాల్లో ఒక్క ఓరి దేవుడా మినహా మిగతా చిత్రాలు అన్నీ కూడా నష్టాలే మిగిల్చాయి. ఓరి దేవుడా బ్రేకివేన్ చాలా స్వల్ప తేడా తో కొట్టింది. దీనితో ఇప్పుడు ట్రెండ్ లో రీమేక్ చిత్రాలు వర్కౌట్ కావని అర్ధం అయిపొయింది.

ఒకపుడు అయ్యితే ఎవరికీ రీమేక్ సినిమాలు కోసం అవగాహనా పెద్దగా లేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు అలా లేదు. దీనితో చిరు పవన్ లాంటి హీరోలు రీమేక్ చిత్రాలు చేస్తే వాటిని పట్టించుకోవడం లేదు ఎవరు. దీనితో చిరు ఇది వరకే ఓ డెసిషన్ తీసుకున్నారట. ఇది లేటెస్ట్ ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

తాను గాడ్ ఫాదర్ రిలీజ్ తర్వాత అసలు రీమేక్ సినిమాలు చేయకూడదు అని ఫిక్స్ అయ్యారట. కానీ భోళా శంకర్ విషయంలో మాత్రం నన్ను మేకర్స్ కన్విన్స్ చేయగలిగారు అని అందుకే ఈ ఒక్క సినిమా చేయాల్సి వచ్చింది అని తెలిపారు. అయితే దీని తర్వాత మరో రీమేక్ కూడా చిరు చేస్తున్నారు అని టాక్ ఉంది. దీనిపై మాత్రం ఓ తుది క్లారిటీ రావాల్సి ఉంది.