నిర్మాణ సంస్థతో దర్శకుడి తెగతెంపులు!

ఈ మధ్యనే ఓ పెద్ద సినిమా వచ్చింది. ఆ చిత్రంలో ఓ ప్రముఖ నటుడు నటించాడు. ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కించిన సినిమా అది. సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది తొలి రోజున. కానీ, ఫర్లేదు.. బాగానే వుంది.. అనిపించేశారు.!

కానీ, ఎక్కడో తేడా కొట్టింది. నిర్మాణ సంస్థకీ, దర్శకుడికీ చెడింది.! ఆర్గ్యుమెంట్స్ గట్టిగానే జరిగాయట. కోల్డ్ వార్ జరుగుతోందంటూ ఓ ప్రచారం తెరపైకొచ్చింది. ఏంటి.? ఇదంతా నిజమేనా.? అని పలువురు సినీ ప్రముఖులు విషయాన్ని ఆరా తీశారట.

సాధారణంగా సినిమా అన్నాక.. చిన్నా చితకా మనస్ఫర్ధలు మామూలే. కానీ, ఆ దర్శకుడు అలాంటోడు కాదు. నిర్మాణ సంస్థ కూడా అంతే. పైగా, అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఆ దర్శకుడు, ఆ నిర్మాణ సంస్థ మధ్యన వున్నాయ్.

సదరు నిర్మాణ సంస్థతో దర్శకుడు దాదాపు తెగతెంపులు చేసుకున్నట్లేననీ, అయితే ఇది జస్ట్ ఫ్రెండ్లీ గ్యాప్ అనీ అంటున్నారు. అబ్బే, అలాంటిదేం లేదు.. త్వరలో అదే అదర్శకుడితో అదే నిర్మాణ సంస్థ నుంచి ఓ సినిమా ఖాయమైందన్న ఇంకో వాదనా ప్రచారంలోకి వచ్చింది.

నిప్పు లేకుండా పొగ రాదు కదా.? అంటే, ఎందుకు రాదు.. పొగపెట్టేందుకు పీఆర్ టీమ్స్ వున్నాయి కదా.? కొందరు సినీ జర్నలిస్టులు, పీఆర్ టీమ్స్‌తో కుమ్మక్కయి.. కాంబినేషన్లను చెడగొడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇదిగో ఇలాంటి పుల్లలూ పెడుతున్నారని అనుకోవాలా.?