Actress Garima: రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం, డ్రగ్స్ మాఫియా హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటివరకూ టాలీవుడ్ సెలబ్రెటీల డ్రగ్ వ్యవహారం కలకలం సృష్టించగా తాజాగా ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో పలు ప్రముఖ సినీ తారల, ప్రముఖ రాజకీయ నాయకు పిల్లలు కూడా ఉండడం గమనార్హం. మామూలుగా సెలబ్రెటీలు అంటేనే పబ్‌లకు వెళ్లడం, అర్థరాత్రి వరకూ ఎంజాయ్ చేయడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారిపోయింది.
ఇక ఇదే తరహాలో మరో పబ్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. కానీ ఈ సారి డ్రగ్స్ వ్యవహారమో, మద్యం వ్యవహారమో కాదు, దొంగతనం. అవును వినడానికి కాస్త వింతగా, ఆశ్చర్యంగా ఉన్నా అదే జరిగింది. ముంబైలోని ఓ పబ్‌లో ఇటీవల జరిగిన ఓ పార్టీలో బాలీవుడ్ నటి, సింగర్ గరిమా జైన్ పాల్గొన్నారు. ఏప్రిల్ 2న ఫ్రెండ్స్‌తో కలిసి ముంబై ఎయిర్ పోర్టుకు దగ్గర్లో ఉన్న పబ్‌కు వెళ్లిన గరీమా, అర్ధరాత్రి వరకూ ఎంజాయ్ చేసి, తెల్లవారుజామన 3.15 సమయంలో పబ్ నుంచి ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో గరిమా తన ఫ్రెండ్స్‌కు కాల్ చేసేందుకు ఫోన్ కోసం చూసుకోగా తన సెల్ ఫోన్ మిస్సయిందనే వార్తను గ్రహించారు. ఎంత వెతికినా లాభం లేకపోయేసరికి ఆమె పబ్ నిర్వాహకులతో పాటు, పోలీసులకూ సమాచారమిచ్చింది.
ఇక పోలీసులు కూడా కేసు నమోదు చేసి, ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరా సహాయంతో మొబైల్‌ను రికవరీ చేసేందుకు నిందితుడ్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు, పబ్ నిర్వాహకులు. ఇంత ఆర్భాటం ఆ ఫోన్‌కోసమేనా ? అందులో ఏముందని ? అనుకోవచ్చు. కానీ అసలు విషయమేమిటంటే పోయిన మొబైల్ ఖరీదు ఏకంగా లక్ష రూపాయలట. అందుకే గరీమా అంత ఆందోళన చెందుతుందని పలువురు భావిస్తున్నారు.