టీజర్ టాక్ : “రంగబలి” తో నాగశౌర్య హిట్ కొట్టేలా ఉన్నాడే.!

ప్రెజెంట్ జెనరేషన్ లో ఉన్న టాలీవుడ్ యువ హీరోస్ లో మంచి హిట్ కోసం చూస్తున్న హీరోస్ లో యంగ్ హీరో కం రైటర్ నాగ శౌర్య కూడా ఒకడు. మరి రీసెంట్ గా తాను చేసి సినిమాలు ఏవి పెద్దగా రాణించలేదు కానీ ఈసారి కొత్త దర్శకుడు పవన్ బాసం శెట్టి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “రంగబలి”.

కాగా ఈ చిత్రాన్ని రీసెంట్ గా “దసరా” చిత్రంతో భారీ హిట్ అందుకున్న నిర్మాణ సంస్థ ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు. ఇక ఈ చిత్రం టీజర్ ని అయితే చిత్ర అయిత్ ఇప్పుడు రిలీజ్ చేయగా ప్రస్తుతం ఆడియెన్స్ మినిమమ్ గా కోరుకుంటున్న ఎంటర్టైన్మెంట్స్ తో వీరు వస్తున్నారని చెప్పాలి.

కాగా ఇంతే కాకుండా టీజర్ లో క్రేజీ ఫన్ సీన్స్ తో పాటుగా మాస్ మూమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక ఫన్ లో అయితే మెడికల్ షాప్ లో సీన్ అలాగే తన ఫ్రెండ్ సత్య తో బస్సు లో వెళ్ళేటప్పుడు వైన్ షాప్ చూసినపుడు సీన్స్ హిలేరియస్ గా పేలాయి. ఇక దీనితో పాటుగా మాస్ సీన్స్ లో నాగ శౌర్య బాగున్నాడు.

మొత్తానికి అయితే ఈ టీజర్ తో నాగ శౌర్య మంచి హిట్ తో కం బ్యాక్ అలాగే నిర్మాణ సంస్థ దసరా తర్వాత మరో హిట్ ని కొట్టేలా అనిపిస్తున్నారు. కాగా ఇదే టీజర్ తో సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ సినిమా అయితే ఈ జూలై 7న రిలీజ్ కాబోతున్నట్టుగా వెల్లడి చేశారు. 
#Rangabali Teaser | Naga Shaurya | Pawan Basamsetti | YuktiThareja | Pawan Ch | In Cinemas July 7th