చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే మొదట గుర్తొచ్చేది ఒక్కటే వేడి వేడి టీ.. ఉదయం ఎన్ని పనులు ఉన్నా.. బిజీ షెడ్యూల్ ఉన్నా, పనులు పక్కన పెట్టి ముందు కప్పులో చాయ్ తాగాలి. లేకపోతే ఏదో లోటుగా, రోజంతా డల్‌గా ఫీల్ అవుతారు. ఒక కప్పు టీ తాగడం వలన మానసిక ఉల్లాసం, శరీరానికి తక్షణ ఎనర్జీ వస్తుంది. ఉదయం నిద్ర లేవగానే సడెన్‌గా క్యాఫైన్ దెబ్బకు మనకు అలసట తొలగినట్లే ఉంటుంది.
కానీ ఆ చాయ్ వడగట్టడానికి మనం వాడే టీ ఫిల్టర్ వల్లే మన ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని మీకు తెలుసా.. ప్రస్తుతం మార్కెట్లో చౌకగా దొరికే ప్లాస్టిక్ టీ ఫిల్టర్లలో తక్కువ నాణ్యత కలిగిన ప్లాస్టిక్‌ను వాడుతున్నారు. ఇంతే కాదు, రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌ను కూడా కొన్ని కంపెనీలు ధారాళంగా ఉపయోగిస్తున్నాయి. వేడి వేడి టీ ఆ ఫిల్టర్ మీద పోసినప్పుడు అందులోని మైక్రో ప్లాస్టిక్స్, రసాయనాలు మనం తాగే టీకి మిశ్రమమవుతాయి. అంటే మనం రోజూ కప్పు కప్పు చాయ్‌తో మనం మైక్రోప్లాస్టిక్స్‌ని గ్లాసులుగా లోపలికి పంపేస్తున్నా అన్నమాట.
ఇందులో అసలు ప్రమాదం ఏంటంటే ఇవి దీర్ఘకాలంలో.. శరీరానికి హానికరంగా మారతాయి. కాన్సర్ మొదలు హార్మోన్ సమస్యలు, గుండె సమస్యలు.. ఇలా చాలా దాకా దారి తీస్తాయి అని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే ప్లాస్టిక్ టీ ఫిల్టర్ వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనికి బదులుగా స్టీల్ లేదా మంచి మెటల్ స్ట్రైనర్ వాడటం చాలా సురక్షితం అంటున్నారు.. కొంచెం ఖర్చు ఎక్కువే కానీ భవిష్యత్తులో పెద్ద వ్యాధులను ఇది దూరం చేస్తుంది.
ఇంకా హోటళ్లలో బయట టీ తాగేవాళ్లకు ఈ విషయంలో జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కడ టీ తాగుతున్నామో, వారు ఎలాంటి ఫిల్టర్ వాడుతున్నారో గమనించండి. అంతేకాదు ఇంట్లో ఎప్పటికప్పుడు ఫిల్టర్లను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. బేకింగ్ సోడా, నిమ్మకాయ కలిపి వేడి నీటిలో నానబెట్టి శుభ్రం చేయడం, లేదా వెనిగర్ నీటిలో ఉంచి కొంచెం తర్వాత బ్రష్‌తో రుద్దడం చాలా ఉపయోగకరం. డిష్ వాష్ లిక్విడ్, ఉప్పు కలిపి కూడా స్ట్రైనర్‌ను మురికిని తొలగించవచ్చు. ఇలా చేసుకుంటే టీ ఫిల్టర్ ఎప్పుడు కొత్త లాంటి ఉతికినట్టు ఉంటుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో మనం పెద్ద సమస్యలను దూరం చేయగలమని నిపుణులు చెబుతున్నారు.