లేటెస్ట్ : “హరిహర వీరమల్లు” పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన యూనిట్.!

harihara veeramallu

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొల్పుకొని ఈ చిత్రాన్ని మేకర్స్ నెక్స్ట్ లెవెల్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా ఇప్పుడు ఈ చిత్రం భారీ షెడ్యూల్ ని రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కిస్తుండగా ఇప్పుడు చిత్ర యూనిట్ అయితే ఓ భారీ అప్డేట్ ని అందించారు. హరిహర వీరమల్లు షూటింగ్ ఎక్కడా గ్యాప్ లేకుండా కంప్లీట్ అవుతుంది అని పవన్ సహా మొత్తం 900 మంది ఆర్టిస్టులతో ఇప్పుడు షూటింగ్ ఈ అక్టోబర్ చివరి వరకు  చేశామని చిత్ర యూనిట్ తెలిపారు.

అంతే కాకుండా ఈ చిత్రం డెఫినెట్ గా అనుకున్న అంచనాలు రీచ్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నామని తప్పకుండా ప్రపంచ వ్యాప్తంగా సెలెబ్రేట్ చేసుకునే విధంగా ఉంటుంది అని తెలిపారు. అయితే దీనికి ఆడియెన్స్ నుంచి అయితే తమ ప్రేమ, ఆదరణ మాత్రం కావాలని చిత్ర యూనిట్ కొన్ని లొకేషన్ ఫోటోలు పెట్టి షేర్ చేశారు. దీనితో ఈ బిగ్ అప్డేట్ మళ్ళీ పవన్ ఫ్యాన్స్ లో కేజ్రీగా మారింది.