సెన్సేషన్ రేపిన మహేష్ బాబు..ఏ హీరోకి లేని ఘనత కొట్టేసాడు.!

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు తెలుగు సినిమా సహా ఇండియన్ సినిమా సహా ప్రపంచ వార్తల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న పేరు. అయితే మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సక్సెస్ అనంతరం మహేష్ వెకేషన్ ని వెళ్ళిపోయాడు. మరి ఈ వెకేషన్ లో తాజాగా వరల్డ్ నెంబర్ 1 బిలినియర్ అయినటువంటి మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో కలిసి ముచ్చటించడం పెను సంచలనంగా మారింది. 

సరే ఈ కలయిక ఏదో యాదృచ్చికంగా కలిసి ఉండొచ్చు కానీ మళ్ళీ బిల్ గేట్స్ మహేష్ బాబుకి సోషల్ మీడియాలో రిప్లై ఇవ్వడం ఏదైతే ఉందొ అది ఇంకో లెవెల్ అని చెప్పాలి. బహుశా ఇలా ఇండియన్ సినిమా దగ్గర ఏ ఇతర హీరోకి కూడా జరగలేదు. మరి ఇదే అనుకుంటే దీనికి మించిన బాంబ్ ఇంకొకటి కూడా ఉంది. 

గేట్స్ మహేష్ కి తన స్పందనను తెలియజేయడమే కాక ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ లలో మహేష్ బాబుని బిల్ గేట్స్ ఫాలో అవుతుండడం ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. ఇది అసలైన మహేష్ రేంజ్ అంటూ మహేష్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే మహేష్ బాబు మాత్రం ఇలాంటి ఒక అరుదైన ఘనతని తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పి తీరాలి.