దసరా పండుగ వచ్చింది .. వెళ్ళిపోయింది. కాని అందరూ అనుకున్నట్టు థియోటర్స్ లో బొమ్మ మాత్రం పడలేదు. గత నెలరోజులుగా దసరా పండుగ సందర్భంగా థియోటర్స్ ఓపెన్ కానున్నాయని రామ్ రెడ్ సినిమా తోపాటు ఉప్పెన, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, క్రాక్, సోలో బ్రతుకే సో బెటరు లాంటి సినిమాలు రిలీజ్ అవుతాయనుకున్నారు. కాని థియోటర్స్ ఓపెన్ చేసే ధైర్యం ఎవరూ చేయలేకపోయాయి.
అయితే ఇప్పుడు 2021 సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్న క్రమంలో ఈసారి బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సినిమాలు పోటీపడంతో పాటు పెద్ద సినిమాల టార్గెట్ కూడా గట్టిగానే ఉందనుకుంటున్నారు. ఇప్పటికే రానా దగ్గుబాటి నటిస్తున్న అరణ్య, పవర్ స్టార్ వకీల్ సాబ్, రామ్ నటించిన రెడ్, రవితేజ క్రాక్, నితిన్ నటిస్తున్న రంగ్ దే సినిమాలతో పాటు అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నట్టు ఇటీవల దరసా పండగ సందర్భంగా ప్రకటించారు. కాగా ఇంకా నాగ చైతన్య నటిస్తున్న లవ్ స్టోరీ, నాని టక్ జగదీష్, శర్వానంద్ శ్రీకారం సినిమాల విషయం తెలియాల్సి ఉది.
అయితే అసలు టార్గెట్ సమ్మర్ లో ఉందని భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలన్ని సమ్మర్ కి రెడీ అవుతున్నాయని క్లారిటీగా తెలుస్తుంది. ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారట. ఇక దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ సినిమా ఆర్ ఆర్ ఆర్ సమ్మర్ కి రెడీ అవుతుంది.
అలాగే కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య సినిమా సమ్మర్ టార్గెట్ గా రిలీజ్ చేయాలని ఇప్పటికే అధిరాకంగా వెల్లడించారు. ఇక పవర్ స్టార్ – క్రిష్ కాంబినేషన్ లో రూపొందనున్న పీరియాడికల్ సినిమా సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ బాబు – పరశురామ్ – కీర్తి సురేష్ కాంబోలో తెరకెక్కబోయో సర్కారు వారి పాట కూడా సమ్మర్ కి రిలీజ్ చేయాలని మహేష్ బావిస్తున్నాడట. ఈ లెక్కన చూస్తే సంక్రాంతి కంటే సమ్మర్ టార్గెట్ చాలా పెద్దదని అర్థమవుతుంది.