మళ్ళీ ఆ రిస్క్ చేసేందుకు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి.!

పవన్ కళ్యాణ్‌తో ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా చేస్తే అది పెద్ద ఫ్లాపు.! రామ్ చరణ్‌తో ‘ఆచార్య’ సినిమా చేస్తే, అది ఇంకా పెద్ద డిజాస్టర్. ఇంకోసారి ఈ మెగా కాంబినేషన్లు చిరంజీవి ట్రై చేయకూడదంటూ మెగాభిమానులు తీర్మానించేసుకున్నారు.

కానీ, ‘మగధీర’ సినిమాలో చిరంజీవి కనిపించారు కదా.? ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లో ఓ పాటలో పవన్ కళ్యాణ్ కనిపించారు కదా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చీరంజీవి – రామ్ చరణ్ మళ్ళీ తెరపై కలిసి నటించే అవకాశాలున్నాయట. ఈ దిశగా చిరంజీవి ఇప్పటికే కథా చర్చలు మొదలు పెట్టారని అంటున్నారు.

‘ఈసారి చేయబోయేది ఔట్ అండ్ ఔట్ మాస్ మసాలా ఎంటర్టైనర్..’ అంటూ మెగా కాంపౌండ్ నుంచి లీకులు అందుతున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ తరహాలో వున్నా, ఆ సినిమాలో రవితేజ పాత్రని చంపేసినట్లు కాకుండా కథ వుండబోతోందట. ఓ యువ దర్శకుడితో చిరంజీవి కథా చర్చలు కొనసాగిస్తున్నారట.