వైరల్ : నక్కతోక తొక్కిన సుమంత్ ప్రభాస్.!

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర ఓ సినిమా జనాల్లోకి వెళ్ళాలి అంటే అనూహ్యమైన ప్రమోషన్స్ తప్పని సరి అలా లేటెస్ట్ గా సోషల్ మీడియాలో సహా సినీ వర్గాల్లో ఊదరగొడుతూ వచ్చిన లేటెస్ట్ సినిమానే “మేమ్ ఫేమస్”. యూట్యూబ్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా తన దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి నిన్న షాకింగ్ గా అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి కూడా ఊహించని ట్వీట్ తో అయితే భారీ బూస్టప్ దక్కినట్టు అయ్యింది.

అయితే మహేష్ బాబు మాటే ఈ సినిమాకి అంత ప్లస్ కాగా ఒక్కసారిగా సుమంత్ ప్రభాస్ కోసం టాపిక్ కూడా ఎక్కువ అయ్యింది. మరి ఈ యంగ్ నటుడు అయితే ఇప్పుడు నక్క తోక తొక్కినట్టుగా సినీ వర్గాల్లో ఓ టాక్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది.

కాగా నిన్న అప్రిషియేట్ చేసిన మహేష్ ఇప్పుడు ఏకంగా ఈ యువ నటునికి తన నిర్మాణ సంస్థలో ఓ సినిమా కూడా ఆఫర్ ఇచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అంటే మహేష్ నిర్మాణంలో ఈ యంగ్ హీరో నటిస్తున్నాడని ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందట. మరి ఈ లెక్కన ఈ యంగ్ నటుడు నక్క తోక తొక్కినట్టే కదా.

మహేష్ కి అయితే ఈ మేమ్ ఫేమస్ సినిమా బాగా నచ్చేసింది అని చెప్పారు. అందరినీ మెచ్చుకొని ట్వీట్ వేయడం ఒకెత్తు అయితే ఇప్పుడు ఏకంగా సుమంత్ కి తన బ్యానర్ లో సినిమా ఆఫర్ చేయడం అనేది అతడికి తన లైఫ్ లోనే ఓ గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. మరి మహేష్ ఇచ్చిన ఆఫర్ తో ఈ యువ నటుడు ఎక్కడ వరకు వెళ్తాడో చూడాలి.