సుధీర్ కెరియర్ లోనే గాలోడు సినిమా కోసం హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న సుదీర్?

సక్సెస్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుడిగాలి సుదీర్ తన కామెడీ టైమింగ్ పంచులతో బుల్లితెరపై తిరుగులేని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే బుల్లితెరపై సక్సెస్ఫుల్ మెల్ యాంకర్ గా కూడా కొనసాగుతున్నాడు. బుల్లితెరపై ఎంతో బిజీగా ఉంటూనే బిగ్ స్క్రీన్ పై తన టాలెంట్ నిరూపించుకోవడానికి సైడ్ క్యారెక్టర్ లో నటిస్తూ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సుధీర్ హీరోగా ఇప్పటికే త్రీ మంకీస్ అనే సినిమాలో హీరోగా నటించి ఓ మోస్తారు విజయాన్ని అందుకున్నాడు.గత ఏడాది అక్కినేని అఖిల్ సూపర్ హిట్ సినిమ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో కూడా సుధీర్ డిఫరెంట్ పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా సుధీర్ కెరియర్ లో భారీ బడ్జెట్ సినిమాగా రూపుదిద్దుకున్న గాలోడు సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే గాలోడు సినిమాకు సంబంధించిన ట్రైలర్, పోస్టర్ పై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాండ్ రావడంతో సుధీర్ అభిమానుల్లో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు.

గాలోడు సినిమాకు సుధీర్ అందుకున్న పారితోషకం దాదాపు 50 లక్షలు ఉంటుందని ఈ సినిమా మొత్తం బడ్జెట్ మూడు కోట్లు కాగా సుధీర్ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ సినిమా కావడం విశేషం.కామెడీ షోలతో ఒకరోజు ఎపిసోడ్ కు దాదాపు రెండు లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ వస్తున్న సుధీర్ ఇప్పుడు గాలోడు సినిమా ద్వారా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. బుల్లితెర స్టార్ హోదా నుంచి వెండితెర స్టార్ హోదాను దక్కించుకోవడానికి సుధీర్ ఎంతో కష్టపడ్డాడని మనందరికీ తెలుసు. కొన్ని కారణాలతో జబర్దస్త్ ప్రోగ్రాం కు దూరమైన సుధీర్ త్వరలో రీఎంట్రీ ఇస్తున్నాడు అంటూ ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 350 పైగా థియేటర్లలో విడుదలవుతున్న సుధీర్ గాలోడు సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుందాం.