స్టార్ హీరోయిన్ నయనతార ఆస్తుల విలువ అన్ని కోట్ల రూపాయలా?

సినిమా రంగంలో చాలామంది హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఫాలో అవుతారు. ఈ సూత్రాన్ని ఫాలో అయ్యే హీరోయిన్లలో నయనతార ముందువరసలో ఉంటారు. సినిమాల ద్వారా నయనతార కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ స్టార్ హీరోయిన్ ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం అందుతోంది. మరో రెండు రోజుల్లో నయనతార పెళ్లి జరగనుంది.

ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో నయనతార ఇంతకాలం పెళ్లికి దూరంగా ఉంటూ వచ్చారు. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నయనతార కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సౌత్ ఇండియాలోని పాపులర్ హీరోయిన్లలో నయనతార ఒకరు కావడం గమనార్హం. నయనతార డేట్స్ ఇస్తే తమ సినిమా హిట్ అనే భావన చాలామంది దర్శకనిర్మాతల్లో ఉంది.

నయనతార సినిమాలో నటిస్తే ఆ సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేసి ఆదాయాన్ని పెంచుకోవచ్చని నిర్మాతలు భావిస్తారు. హీరోయిన్ నయనతార సినిమా ప్రమోషన్స్ కు కూడా దూరంగా ఉంటారు. ఈ షరతుకు అంగీకరించిన నిర్మాతల సినిమాలలో మాత్రమే నటించడానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పలు ఉత్పత్తులకు ఈ నటి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని సమాచారం.