మ‌రోసారి వార్త‌ల‌లోకి శ్రీముఖి ల‌వ్ ఎఫైర్.. ఎవ‌రా ల‌క్కీ ప‌ర్స‌న్ అంటున్న నెటిజ‌న్స్

త‌న మాట‌ల గార‌డీతో పాటు అంద‌చందాల‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బబ్లీ గార్ల్ శ్రీముఖి. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. శ్రీముఖి ఎక్క‌డ ఉంటే అక్కడ ర‌చ్చ రంబోలానే. బిగ్ బాస్ సీజ‌న్ 3 ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన ఈ పుత్త‌డి బొమ్మ ప్ర‌స్తుతం ప‌లు షోస్ తో బిజీగా ఉంది. అయితే ఈ అమ్మ‌డి ల‌వ్ ఎఫైర్ ఇప్పుడు మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నెటిజ‌న్స్ ఎవ‌రా అంద‌గాడు అంటూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు.

బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొన్న‌ప్పుడు శ్రీముఖి త‌న లైఫ్‌లో జరిగిన డార్క్ బ్రేకప్ లవ్ స్టోరీని బయటపెట్టింది. అంద‌రి అమ్మాయిల్లా తాను ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపింద‌ని చెప్పింది. యాంక‌ర్‌గా కెరియ‌ర్ స్టార్ట్ చేసిన త‌ర్వాత అత‌నితో బ్రేక‌ప్ అయింది. అత‌ను పాపుల‌ర్ వ్య‌క్తే. నా ల‌వ్ స్టోరీ బ్రేక‌ప్ కావ‌డంతో చ‌నిపోదాం అనుకొని డిప్రెష‌న్‌లోకి వెళ్ళాను అంటూ త‌న బాధ‌ను చెప్పుకొచ్చింది . పేరు మాత్రం చెప్ప‌కుండా స్టోరీ అంతా చెప్పే స‌రికి శ్రీముఖి బ్రేకప్ లవ్ స్టోరీలో ఆ వ్యక్తి ఎవరు? శ్రీముఖి ఎవరితో ప్రేమాయణం సాగించింది? ఎవరికి బ్రేకప్ చెప్పింది? అంటూ తెగ ఆరాలు తీసారు . అయిన ఫ‌లితం లేకుండా పోయింది

క‌ట్ చేస్తే శ్రీముఖి ల‌వ్ ఎఫైర్ ఇప్పుడు మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది. కొద్ది రోజులుగా ఓ వ్య‌క్తితో రిలేష‌న్ షిప్ మెయింటైన్ చేస్తున్న శ్రీ అత‌నితో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతుంద‌ట‌. ఈ రిలేష‌న్ షిప్‌ని కంటిన్యూ చేస్తూ త్వ‌ర‌లో పెళ్ళి పీట‌లు కూడా ఎక్కాల‌ని ఈ అమ్మ‌డి ప్లాన్ అని తెలుస్తుంది. మ‌రి ఆ అజ్ఞాత వ్య‌క్తి ఎవ‌ర‌నేది శ్రీముఖి ఎప్పుడు చెబుతుందో చూడాలి. రీసెంట్‌గా శ్రీముఖి త‌న ఫొటో షూట్ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి ఫుల్ వైర‌ల్ అయ్యాయి.