బాలు చనిపోయిన కొన్ని గంటలకే ఆయన ఇంటిముందు ఊహించని సీన్ .. ! 

 

సినీ వినీలాకాశంలో ఒక గొంతు మూగబోయింది. బహుశ ఈ స్వరం మీదికి అమృతం కూడా సరిపోదేమో అందుకే కావచ్చూ ఈ గొంతు భూలోకంలో ఇంత కాలం మోగింది చాలని పై లోకం తీసుకెళ్ళారు దేవతలు.. ఆయన ఎవరని ఆలోచిస్తున్నారా.. గాన గంధర్వుడు అని పిలిపించుకునే ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు.. బహుశా ఈ పేరు ఎవరికి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేని పేరు.. ఎందుకంటే దేశంలోని పదహారు భాషల్లో వేలాది పాటలు పాడిన ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తమిళులు అయితే.. ఆయన్ను తెలుగువాడిగా అస్సలు భావించరు. తమలో ఒకరుగానే అనుకుంటారు.

అంతలా అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆయన నిన్న పరమపదించారు.. ఇకనుండి ఆ తీయని స్వరం ఈ పుడమి మీద లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట ఎందరో అభిమానులు.. సర్వసాధారణంగా ఎవరైనా తమ అభిమాన హీరో మరణిస్తే అతన్ని ఆరాధించే అభిమానులు ఎందరో చివరి చూపుకోసం అల్లాడుతారు.. కానీ ఒక గాయకుడు మరణిస్తే.. వేలాదిగా జనం అతని ఇంటికి పోటెత్తటం బాలుకు మాత్రమే సాధ్యమవుతుందేమో అనిపిస్తుంది.. అసలే పరిస్దితులు బాగాలేని సమయంలో అభిమానులెవరు బాలుగారి పార్దీవ దేహాన్ని చూడడానికి రావద్దని చెప్పినా ఆ మాటలు లెక్కచేయకుండా ఆయన్ను చూసేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు.

 

ఈ నేపధ్యంలో బాలుగారిని చూసేందుకు వచ్చిన తమిళ అభిమాని భావోద్వేగంతో కుప్పకూలిన ఉదంతం ఆయన ఇంటివద్ద చోటు చేసుకుంది.. గత యాభై రోజుల పాటు చెన్నైలోని ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాలుగారు కరోనాను జయించినా.. మిగిలిన ఆరోగ్య సమస్యల్ని అధిగమించలేక నిన్న మరణించిన సంగతి తెలిసిందే. అయితే బాలుగారికి పిచ్చ అభిమాని అయినా ఒక తమిళ అభిమాని ఈ గాన గంధర్వుడి ఇంటి వద్దకు వచ్చి తీవ్రమైన భావోద్వేగంతో ఆయన పాటల్ని పాడుతూ అనుకోకుండా కుప్పకూలాడు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపినట్లుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం బాలు ఇంటి ముందు కుప్పకూలిన అభిమాని క్షేమంగానే ఉన్నట్లు చెబుతున్నారు… ఇకపోతే ఇప్పటివరకు సినీ వినీలాకాశంలో మ‌కుటం లేని మ‌హా‌రాజు గా వెలుగొందిన బాలుగారు ఇక సెలవంటు వెళ్లిన దృశ్యాలను ఆయనను ఎంతగానో ఆరాధించే సంగీత ప్రేమికులు జీర్ణించుకోలేకున్నారు.