Mohan Babu: హాస్పిటల్ కి వెళ్లి మరీ జర్నలిస్టును పరామర్శించిన మోహన్ బాబు.. మరోసారి క్షమాపణలు చెబుతూ!

Mohan Babu: గత రెండు రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకునే వరకు వెళ్లారు. ఇక ఒకానొక సమయంలో వీరి గొడవ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే మోహన్ బాబు సహనం కోల్పోయి మీడియాపై విరుచుకుపడ్డారు. జర్నలిస్ట్ రంజిత్ చేతిలో ఉన్న మైక్ లాక్కొని మరీ దాడి చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ దారిలో రంజిత్ చెవి కనత మధ్య భాగంలో గాయం కావడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇక దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు రంజిత్ హాస్పిటల్ లోనే ఉన్నారు.

ముఖ కవలికలకు సంబంధించిన ఎముక విరగడంతో కొన్నాళ్ల పాటు ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి అంటూ వైద్యులు తెలియజేశారు. ప్రస్తుతం ఆసుపత్రి బెడ్‌ కే పరిమితం అయిన జర్నలిస్ట్‌ రంజిత్‌ను పలువురు పరామర్శించారు. అయితే ఇప్పటికే జరిగిన విషయానికి అశ్శతాపడుతూ మోహన్ బాబు జర్నలిస్ట్ కు సారీ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మోహన్ బాబు మంచు విష్ణు నేరుగా హాస్పిటల్ కి వెళ్లి మరి రంజిత్ ని ఆయన కుటుంబ సభ్యుల్ని కలిశారు. హాస్పిటల్లో ఉన్న రంజిత్ ని కలిసి ఆయన హెల్త్ ఎలా ఉంది ఏంటి అన్న విషయాల గురించి తెలుసుకొని పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే రంజిత్ కు మరోసారి క్షమాపణలు చెప్పారు మోహన్ బాబు.

ఆవేశంలో జరిగిన దానికి క్షమించమంటూ రంజిత్‌ను మరోసారి మోహన్‌ బాబు, విష్ణు క్షమాపణలు అడిగారని తెలుస్తోంది. రంజిత్‌ తో మోహన్‌బాబు కొంత సమయం మాట్లాడారు, ఆయన కుటుంబ సభ్యుల గురించి అడిగి తెలుసుకున్నారట. మోహన్‌బాబు ఇటీవలే తన ఆడియో సందేశంలో చేసిన తప్పుకు చింతిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. తన కుటుంబ వ్యవహారంలో మీడియా రావడంను సహించలేక పోయాను అన్నారు. మీ కుటుంబ వ్యవహారంలో ఇలా జరిగితే మీరు ఎలా రియాక్ట్‌ అవుతారు అంటూ ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత ఒక ప్రెస్‌ నోట్‌ ను విడుదల చేసి జర్నలిస్ట్‌ రంజిత్‌ కి క్షమాపణలు చెప్పడంతో పాటు, ఆయన కుటుంబ సభ్యులకు, అలాగే ఆయన పని చేస్తున్న మీడియా సంస్థకు క్షమాపణలు చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. తన కుటుంబ వ్యవహారంలో మీడియా వారు వ్యవహరించిన తీరుపై మరోసారి ఆయన అసహనం వ్యక్తం చేశారు.