Singer Kalpana: సింగర్ కల్పన నిద్ర మాత్రలు తీసుకొని సూసైడ్ చేసుకోబోయింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈమె నిన్న సాయంత్రం తన అపార్ట్మెంట్లో అధిక సంఖ్యలో నిద్రమాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో అది గమనించిన తన భర్త వెంటనే అపార్ట్మెంట్ ఓనర్ కి ఫోన్ చేసి తన భార్యను రక్షించాలి అంటూ వేడుకున్నారు అయితే తన భర్త ఇంట్లో లేని సమయంలో ఈమె సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇకపోతే తన కుమార్తె కేరళలో ఉంటుంది అయితే తాను తిరిగి హైదరాబాద్ రావాలని కల్పన కోరారట కానీ తన కుమార్తె మాత్రం తాను కేరళలో ఉంటాను అని చెప్పారు. ఇలా ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగిన కాసేపటికే ఈమె నిద్ర మాత్రలు తీసుకుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కల్పన చికిత్స పొందుతున్న నిజాంపేట హోలిస్టిక్ ఆస్పత్రికి కల్పన పెద్ద కుమార్తె వచ్చారు అక్కడ ఆమె మీడియా సమావేశంలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
అమ్మ ఆత్మహత్య చేసుకోబోయింది అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. ఇలా కల్పన ఆత్మహత్య అంటూ వస్తున్న వార్తలను పూర్తిగా ఖండించారు. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు. మరి కొద్ది రోజులలో ఎప్పటిలాగే మేమంతా మీ ముందుకు వస్తాము అయితే అమ్మ ప్రతిరోజు నిద్ర మాత్రలు వేసుకుంటుంది కానీ నిన్న అవి కాస్త డోస్ ఎక్కువగా వేసుకోవడం వల్ల ఇలా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని ఇంతకు మించి తమ కుటుంబంలో ఏమి జరగలేదని ఎవరు కూడా తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు అంటూ కోరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లు హాస్పిటల్ సిబ్బంది వెల్లడించారు.