Mohan Babu: ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే. కొట్టుకోవడం, తిట్టుకోవడం, మీడియాపై దాడి చేయడం, మీడియాపై విరుచుకు పడడం ఇలాంటివన్నీ కూడా అసంచలనంగా మారాయి. మరోవైపు మంచు మనోజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ తనకు న్యాయం జరిగేలా చూడమంటూ వేడుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల వీడియోలు ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఈ గొడవల్లో భాగంగానే తాజాగా మోహన్ బాబు ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపుగా వారం రోజులపాటు మోహన్ బాబుని ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. అయితే మంగళవారం రాత్రి జల్‌పల్లిలోని తన నివాసంలో జరిగిన ఘర్షణ అనంతరం మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఒళ్లు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కంటి దిగువ భాగంలో గాయమైనట్లు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.
అలాగే బీపీ ఎక్కువగా ఉందని, గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయని చెప్పారు. దీంతో రెండు రోజుల పాటు ఆయనకు చికిత్స అందించారు. గురువారం మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జి చేశారు. ఇంట్లోనే వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. ఈ విషయం పట్ల మనోజ్ మీడియాను అలాగే పోలీసులను ఆశ్రయించగా మరోవైపు మోహన్ బాబు ఈ విషయం పట్ల మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ వివాదం రోజురోజుకీ ముదురుతూనే ఉంది. మరి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి మరి.