ఈ మధ్య కాలంలో ఆస్పత్రుల ఖర్చులు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్య చికిత్స తీసుకోవడం సర్వ సాధారణం అయింది. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా పారాసిటమాల్ ట్యాబ్లెట్ ను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. పారాసిటమాల్ ట్యాబ్లెట్ ను పరిమితంగా తీసుకుంటే ఎలాంటి నష్టం లేదు కానీ మరీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయట.
డాక్టర్ సూచించిన మోతాదు కంటే ఎక్కువ మోతాదు ఉన్న పారాసిటమాల్ ట్యాబ్లెట్ ను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎలుకలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించడం జరిగింది. 4 గ్రాములకు మించి పారాసిటమాల్ ట్యాబ్లెట్ ను తీసుకుంటే మాత్రం లివర్ కు సంబంధించిన సమస్యలు రావడం ఖాయమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఈ ట్యాబ్లెట్లను పరిమితికి మించి తీసుకోవడం ద్వారా శరీర అవయవాల్లోని కీలకమైన నిర్మాణం పాడవుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పారాసిటమాల్ ట్యాబ్లెట్ ను వైద్యుల సూచనల మేరకు వాడటం మించి మితిమీరిన వినియోగం వల్ల ఆరోగ్యానికి నష్టం తప్ప ఎలాంటి లాభం ఉండదని గుర్తుంచుకోవాలి. ప్రతి ఆరోగ్య సమస్యకు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వాడటం కూడా మంచిది కాదు.
ఇష్టానుసారం ట్యాబ్లెట్లను వాడితే మాత్రం దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా వ్యాధులు వాటంతట అవే తగ్గిపోతాయి. శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి కాగా కాలేయానికి హాని కలగకుండా ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు.