‘సిద్దార్థ్‌ రాయ్‌’ ట్రైలర్‌ విడుదల

చాలా చిత్రాల్లో బాల నటుడిగా నటించిన దీపక్‌ సరోజ్‌ ఇప్పుడు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సిద్దార్థ్‌ రాయ్‌’. దీనికి వి యశస్వి దర్శకత్వం వహించాడు. రధన్‌ సంగీతాన్నందించిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో దీపక్‌ సరోజ్‌ సిద్దార్థ్‌ రాయ్‌ గా కనిపిస్తాడు, అలాగే అతని పాత్రకి రెండు వైవిధ్యాలున్నాయని అర్థం అవుతోంది.

ఈ సినిమా ట్రైలర్‌ చూసాక ఇది కొంచెం అర్జున్‌ రెడ్డి సినిమాతో పోలుస్తారు అని అనిపిస్తోంది. ఈ సినిమా టీజర్‌ గత సంవత్సరం విడుదలైంది, అప్పుడే ఈ సినిమా ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రమని తెలిసింది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ చూసాక ఈ సినిమా కచ్చితంగా వైవిధ్యంగా వుండబోతోంది అని కూడా తెలుస్తోంది.

ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేశారని చిత్ర నిర్వాహకులు చెబుతున్నారు. కెమెరా శ్యామ్‌ కె నాయుడు, ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి పనిచేస్తుండగా ఈ సినిమాకి నిర్మాతలు జయ ఆడపాక, ప్రదీప్‌పూడి, సుధాకర్‌ బోయిన. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వి.యశస్వి.

ఈ సినిమా ఫిబ్రవరి లో విడుదలవుతుందని ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో చెప్పడం జరిగింది. ఇందులో కథానాయికగా తన్వి నేగి నటించగా, కీర్తన ఇంకో ముఖ్య పాత్రలో కనిపించనుంది.