షాకింగ్ : “వీరసింహా రెడ్డి” సాంగ్ లీక్..దీనికన్నా ఇంకో షాక్ ఏంటంటే!

ఇప్పుడు నందమూరి నటసింహ నందమూరి బాలయ్య హీరోగా నటిస్తున్న చిత్రం పవర్ ఫుల్ ఏక్షన్ ఎంటర్టైనర్ “వీరసింహా రెడ్డి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం షూటింగ్ వేగంగా పూర్తి అవుతుంది.

అలాగే మరోపక్క అయితే నిన్ననే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ “జై బాలయ్య” మరో వెర్షన్ ని అనౌన్స్ చేశారు. అయితే అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో లీక్ అయ్యిపోయింది. పైగా వీడియో రూపంలో లీక్ కావడం విశేషం.. అయితే దీనికన్నా మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే థమన్ మరోసారి కాపీ ట్యూన్ కొట్టి దొరికేసాడా అన్నట్టు టాక్ గట్టిగా స్ప్రెడ్ అవుతుంది.

మరి ఈ సాంగ్ ఎలా ఉందంటే.. గతంలో విజయశాంతి భారీ హిట్ చిత్రం ‘ఒసేయ్ రాములమ్మ” చిత్రం టైటిల్ సాంగ్ బీట్ ని అచ్చం థమన్ జై బాలయ్య అంటూ దింపేసాడు. దీనితో ఇదేం సాంగ్ రా నాయనా అనుకుంటున్నా నందమూరి అభిమానులు.

అయితే జస్ట్ ఒక్క ముక్క వరకేనా సాంగ్ అంతా ఇలాగే ఉంటుందా అని కూడా ఫ్యాన్స్ నీళ్లు నములుతున్నారు. దీనితో థమన్ మళ్ళీ చేస్తాడో ఏంటో అని ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మేకర్స్ నిర్మాణం అందిస్తున్నారు.