షాకింగ్ : సీనియర్ కమెడియన్ ఇంట తీరని విషాదం.!

ఇండియన్ సినిమా దగ్గర ఉన్న అన్ని భాషల ఇండస్ట్రీలలో కూడా కమెడియన్ లేని ఇండస్ట్రీ అంటూ లేదు. మరి మన సౌత్ నుంచే ఎంతో మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ తెలుగులో అంటే హాస్య బ్రహ్మ బ్రహ్మానందమే టాప్ అంటారు. అయితే మన బ్రహ్మానందం ఎలాగో అదే విధంగా తమిళ నాట కూడా నటుడు వడివేలు కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఎన్నో ఐకానిక్ రోల్స్ తాను ఇప్పటివరకు తమిళ్ లో చేశారు. అలాగే తెలుగులో డబ్ అయ్యిన ఎన్నో సినిమాల్లో కామెడీ చూసి కూడా మనం నవ్వుకొని ఉంటాము. ఇలా తెలుగు ఆడియెన్స్ ని కూడా ఎంతగానో అలరించి నవ్వించిన వడివేలు ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొన్నట్టుగా తెలుస్తుంది.

వడివేలు మాతృమూర్తి సరోజిని తన 87వ ఏట ఆమె తుది శ్వాస విడిచినట్టుగా ఇప్పుడు తమిళ సినీ వర్గాలు తెలియజేశాయి. దీనితో ఈ విషాద వార్త తమిళ సినిమా వర్గాలను దిగ్బ్రాంతి కి లోను చేసింది. ఇక ఈ వార్త విన్న తమిళ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని అలాగే వడివేలు కి ధైర్యం చెబుతున్నారు.

మరి ఆవిడ అంతిమ యాత్రపై పలు ఎమోషనల్ వీడియో లు కూడా బయటికి రావడంతో తమిళ ఆడియెన్స్ మరింత భావోద్వేగానికి లోనవుతున్నారు. మరి వడివేలు చంద్రముఖి, ప్రేమికుడు, ఒకే ఒక్కడు, రీసెంట్ గా అయితే బిగిల్ లాంటి సినిమాల్లో కనిపించారు.