ఇండస్ట్రీ టాక్ : సైలెంట్ గా లాంచ్ అయ్యిపోయిన పవన్ సినిమా..!

Pawan Kalyan Bheemla Nayak

గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా కంటే ఇప్పుడు పొలిటికల్ గా ఎక్కువ బిజీగా ఉండడంతో తన సినిమా దర్శక, నిర్మాతలు మళ్ళీ ఆందోళనలో పడ్డారు. అయితే ఈ సినిమాల లైనప్ లో పవన్ హీరోగా చేస్తున్న “హరిహర వీరమల్లు” అనే భారీ చిత్రం ఆల్రెడీ స్టార్ట్ చేయగా దీని తర్వాత అయితే మరికొన్ని సినిమాలు ఓకే చేసాడు. 

అయితే ఈ సినిమాల్లో ఇంకో రీమేక్ అంటూ వచ్చిన వార్త పవన్ ఫ్యాన్స్ ని మరింత నీరసానికి లోను చేసింది అయినా కూడా పవన్ ఆ సినిమాను ఓకే చేసి తన ఆర్ధిక మూలాల కోసం కేవలం 20 రోజులు మాత్రం కేటాయించి ఒప్పుకున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ వచ్చింది. 

అయితే ఇప్పుడు ఈ సినిమా పై ఆశ్చర్యకరంగా ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఈరోజే ఈ సినిమా హైదరాబాద్ లో లాంచ్ అయ్యిపోయిందట. అస్సలు ఎలాంటి అప్డేట్ కూడా లేకుండా ఈ చిత్రం సైలెంట్ గా లాంచ్ అయ్యిపోవడం అందరికి షాకింగ్ గా మారింది. 

కనీసం ఒక్క ఫోటో కూడా ఈ సినిమాపై రాకపోవడం మరో షాకింగ్ అంశం. ఇక ఈ చిత్రంలో అయితే సాయి ధరమ్ తేజ్ మెయిన్ హీరోగా నటిస్తుండగా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పవన్ గోపాల గోపాల తరహా క్యామియో లో కనిపించనున్నాడు. అలాగే నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.