ప్రస్తుతం అమరన్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు తమిళ నటుడు శివ కార్తికేయన్. అంచనాలకు మించి అతిపెద్ద సక్సెస్ అందుకున్న ఈ సినిమా శివ కార్తికేయన్ కెరియర్ లోనే ద బెస్ట్ మూవీ అనవచ్చు. ఇక ఆ తర్వాత అతను ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఒకటి, అలాగే శిబి చక్రవర్తి డైరెక్షన్లో ఒక సినిమా, ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.శివ కార్తికేయన్ కెరీర్ మీద ఎంత దృష్టి పెడతాడో కుటుంబం మీద కూడా అంతే దృష్టి పెడతాడు.
అతను తన భార్య పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తాడో అందరికీ తెలిసిందే. ఇక అతని కూతురు చిన్న వయసులోనే సినిమా పాట అందరి మన్ననలు అందుకుంది అలాగే తన కుటుంబానికి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయమైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యనే మూడో బిడ్డకి నామకరణ మహోత్సవం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చేసిన విషయం అందరికీ తెలిసిందే.
రీసెంట్ గా తన భార్యని ఆర్మీ ఆఫీసర్ డ్రెస్ లో కనిపించి సర్ప్రైజ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే అలాగే శివ కార్తికేయన్ అక్క గౌరీ అన్నా కూడా అతనికి చాలా ఇష్టం. ఈరోజు ఆమె పుట్టినరోజు కావటంతో ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ మినీ కూపర్ కారుని బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చాడు ఈ హీరో. ఆ కారు ఖరీదు 50 లక్షల రూపాయలు. అక్కకి శుభాకాంక్షలు తో పాటు పెట్టిన పోస్టులో అక్క నాకు అతి పెద్ద ప్రేరణ, నా అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
బిడ్డ పుట్టిన తర్వాత ఎంబిబిఎస్ చదవడం నుంచి 38 ఏళ్ల వయసులో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో గోల్డ్ మెడల్ సాధించడం వరకు నువ్వు అన్ని అడ్డంకులను అధిగమించావు, నిన్ను చూసి నాన్న చాలా గర్వపడతారు. ఆమెకి అండగా నిలిచిన మా బావగారికి కూడా ధన్యవాదాలు అని పోస్ట్ చేయటంతో శివ కార్తికేయన్ మంచి హీరో, మంచి భర్త, మంచి తండ్రే కాదు మంచి తమ్ముడు కూడా అనిపించుకున్నాడు. అంటున్నారు నెటిజిన్స్.