రామ్ చరణ్ సినిమాలో ఆమె ఔట్.! జాన్వీ కపూర్ ఇన్.!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాకి సంబంధించి, కాస్టింగ్ కాల్ ఒకటి నడుస్తోన్న సంగతి తెలిందే. ప్రస్తుతానికైతే రామ్ చరణ్ ఇంకా ‘శంకర్ చెర’లోనే వున్నాడు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు.

శంకర్ సినిమాలంటేనే అంత.! చరణ్, ఆ చెరలో ఇరుక్కుపోయి నానా తంటాలూ పడుతన్నాడు. ప్రస్తుతం ఇంకా ‘గేమ్ ఛేంజర్’ సినిమా పనుల్లోనే వున్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత చరణ్ చేయబోయే సినిమా బుచ్చిబాబు సన దర్శకత్వంలోనే.

ఇప్పటికే హీరోయిన్ ఎంపిక విషయమై బుచ్చిబాబు సన అండ్ టీమ్, లుక్ టెస్ట్స్ చాలానే చేసేసింది.. చాలామంది కొత్త భామల మీద. అందులో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తదానీ కూడా ఒకరు.

రషా తదానీ మొన్నామధ్య హైద్రాబాద్ వచ్చి, లుక్ టెస్ట్‌లో పాల్గొని వెళ్ళింది కూడా. అయితే, ఆ లుక్ టెస్ట్ ఏమయ్యింది.? పాస్ ఆర్ ఫెయిల్.? అన్న విషయమై స్పష్టత లేదు.

తాజాగా, జాన్వీ కపూర్‌తో లుక్ టెస్ట్ చేయబోతున్నాడట బుచ్చిబాబు సన. ఈ లుక్ టెస్ట్ కోసం జాన్వీ త్వరలోనే హైద్రాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. లుక్ టెస్ట్ అనేది జస్ట్ ఫార్మాలిటీ అనీ, జాన్వీ కపూర్ పేరు దాదాపుగా ఫైనల్ అయిపోయిందనీ అంటున్నారు.

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి సీక్వెల్‌ని రామ్ చరణ్ – జాన్వీ జంటగా చేయాలని చాలాకాలం క్రితమే అనుకున్నా, అది కుదరలేదు. ఆ సినిమాతోనే జాన్వీ కపూర్ తెలుగు తెరపై తెరంగేట్రం చేయాల్సి వుంది.

కానీ, ‘దేవర’తో జాన్వీ కపూర్ తెలుగునాట తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.