సెన్సేషనల్ : “ఆదిపురుష్” కి తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్ బిజినెస్.!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒకే ఒక్క సినిమా పేరు “ఆదిపురుష్”. ప్రభాస్ నటించిన ఈ సినిమాపై టీజర్ తర్వాత మొదట్లో ఎంత నెగిటివిటీ వచ్చిందో ఇప్పుడు దానికి ఎన్నో ఇంతకు పాజిటివ్ రెస్పాన్స్ తో అయితే ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది.

కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ పెద్ద తెరపై చూడాలని అంతా ఆసక్తి కనబరుస్తు ఉండగా ఈ సినిమా బిజినెస్ పై ఇప్పుడు షాకింగ్ వార్తలు ఐతే తెలుస్తున్నాయి. మరి నిన్ననే ఈ సినిమా ఒక్క వైజాగ్ రీజన్ లో హక్కులకు 20 కోట్లు పలకగా ఇపుడు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఫైనల్ డీల్ కోసం షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

కాగా ఈ భారీ చిత్రం ఇది వరకే తెలుగు హక్కులని యూవీ క్రియేషన్స్ వారు 100 కోట్లకి కొన్నారు అని రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకంగా 170 కోట్లు ఒక్క తెలుగు రాష్ట్రాల హక్కులతోనే కొనుగోలు చేసినట్టుగా ఇప్పుడు సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ సెన్సేషనల్ డీల్ వెనుక మరో ఏదో ప్లాన్ కూడా ఉందని తెలుస్తుంది. దీనితో అయితే ఇప్పుడు ఆదిపురుష్ బిజినెస్ డీల్ సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. అంతే కాకుండా కేవలం తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకి పైగా బిజినెస్ జరిగిన సినిమాలు నాలుగు ఉన్న ఏకైక హీరోగా అయితే ఇప్పుడు ప్రభాస్ నిలవడం విశేషం.

ఈ డీల్ అయితే ఇంత మొత్తంలో చాలా పెద్దదే అని చెప్పాలి. తెలుగులో ఎంతో రేంజ్ లో ఆడితే తప్ప ఇంత మొత్తం వెనక్కి రాదు. మరి ఆ రాముడు ఏం చేస్తాడో చూడాలి. అది తెలియాలి అంటే ఈ జూన్ 16 వరకు ఆగాల్సిందే.